Govt raises MSP on wheat by Rs 110: కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల సంక్షేమం కోసం, రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా పలు పంటల మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022-24 ఆర్థిక సంవత్సరం రబీ సీజన్ కు గానూ.. 6 పంటలకు మద్దతు ధరలను పెంచింది. గోధుమ కనీస మద్దతు ధర క్వింటాల్ కు రూ. 110 పెంచింది. దీంతో క్వింటాల్ గోధుమల ధర రూ. 2,125కు చేరింది. ఇదే విధంగా అవాలకు రూ.400…
Man dies while dancing in Gujarat's Dahod: డాన్స్ చేస్తున్న మరో వ్యక్తి గుండె ఆగింది. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు దేశంలో అక్కడక్కడ జరుగుతున్నాయి. అప్పటి వరకు సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న వ్యక్తులు ఒక్కసారిగా గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. తాజా మరోసారి ఇలాంటి ఘటనే పునరావృతం అయింది. గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ జిల్లాలో దేవ్‌గఢ్ బరియా ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
elicoptor crashes near Uttarakhand's Kedarnath: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కేదార్ నాథ్ కు రెండు కిలోమీటర్ల దూరంలో గరుడ్ చట్టిలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ తో సహా మొత్తం ఏడుగురు మరణించారు. గుప్తకాశీ నుంచి కేదార్ నాథ్ వెళ్తున్న సమయంలో సాంకేతిక లోపం, వాతావరణ కారణాల వల్ల హెలికాప్టర్ క్రాష్ అయినట్లు తెలుస్తోంది. ఆర్యన్ ఏవియేషన్ హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేదార్ నాథ్ కు వెళ్తోంది. హెలికాప్టర్ కూలిన వెంటనే మంటలు…
Manish Sisodia summoned by CBI in Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిలీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నోటీసుల జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ, ఈడీలు అనుమానితుల ఇళ్లపై పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించాయి. ఇప్పటికే కొంతమందిని విచారిస్తున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Amit Shah started MBBS course in Hindi language: దేశ విద్యా వ్యవస్థలో చారిత్రక ఘట్టం మొదలైంది. తొలిసారిగా వైద్యవిద్యను హిందీ మాధ్యమంలో ప్రారంభించారు. మధ్యప్రదేశ్ భోపాల్ లో హిందీలో ఎంబీబీఎస్ కోర్సును ప్రవేశపెట్టారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. కొత్త జాతీయ విద్యావిధానంలో మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తున్నామని.. ప్రధాని మోదీ కోరిక నెరవేరిందని ఆయన అన్నారు. భారతదేశ విద్యా రంగంలో ఇది కీలకమైన రోజని అమిత్ షా అన్నారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజుగా దీన్ని అభివర్ణించారు. ఎంబీబీఎస్…
Bal Thackeray's grandson supports CM Ek Nath Shinde: మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్ తగిలింది. శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే మనవడు నిహార్ ఠాక్రే, సీఎం ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలిపాడు. త్వరలో జరిగే అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ముంబై ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పారు. నవంబర్ 3న జరుగుతున్న అంధేరీ ఉపఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే పార్టీ నుంచి రుతుజా లట్కేను ఉద్ధవ్ ఠాక్రే పోటీలో నిలబెడుతుండగా.. ఏక్ నాథ్…
Shooting in Mexico bar.. 12 people died: మెక్సికో దేశంలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. గ్వానాజువాటో రాష్ట్రంలో ఒక నెల లోపు రెండు కాల్పుల ఘటనలు జరిగాయి. మెక్సికోలోని ఇరాపుయాటోలోని ఓ బార్ లో గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో మొత్తం 12 మంది మరణించారు. ఇందులో ఆరుగురు మహిళల, ఆరుగురు మగవాళ్లు ఉన్నారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ ఇరాపుటోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో మెక్సికోలో గన్ ఫైరింగ్స్ ఎక్కువయ్యాయి.
Sitharaman's ‘rupee not sliding but dollar strengthening’ remark: ఇటీవల కాలంలో రూపాయి విలువ ఎప్పుడూ లేని విధంగా పడిపోతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతోంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రూపాయి పడిపోవడం లేదని.. డాలర్ బలపడుతోందని ఆమె అన్నారు. ఇది అన్ని దేశాల కరెన్సీపై ప్రభావం చూపిస్తుందని ఆమె అన్నారు. అనేక ఇతర అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థతో…
Boat capsizes in Bihar’s Katihar: బీహార్ రాష్ట్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ విషాదకర సంఘటన ఆదివారం రోజున కతిహార్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 10 మంది ఉంటే ఏడుగురు మరణించారు. మరో ముగ్గురు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారు. పడవలో ఉన్నవారంతా రైతులే అని తెలుస్తోంది.
Infosys delays onboarding date again: కొత్తగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేరాలనుకునే యువతకు మరోసారి నిరాశే ఎదురైంది. ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి కొత్త ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్ తేదీని మరోసారి వాయిదా వేసింది. గత నాలుగు నెలలుగా కొత్త ఉద్యోగులు చేరికను వాయిదా వేస్తూ వస్తోంది ఇన్ఫోసిస్. మొదటిసారిగా సెప్టెంబర్ 12, 2022 చేరిక తేదీని నిర్ణయించారు. ఆ తరువాత ప్రస్తుతం డిసెంబర్ 19, 2022కు మార్చారు. గత నాలుగు నెలల్లో నాలుగు సార్లు ఆన్‌బోర్డింగ్ తేదీని వాయిదా వేసింది.