Madya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగం వెళ్తున్న బస్సు, లారీ ట్రైలర్ ను ఢీకొట్టింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది అక్కడిక్కడే చనిపోగా.. మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. మొత్తంగా 15 మంది చనిపోగా.. 20 మందికి పైగా గాయపడ్డారు.
Myanmar junta beheads high school teacher: మయన్మార్ దేశంలో ప్రజా ప్రభుత్వం నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత సైన్యం అరాచకాలు పెరిగిపోయాయి. మానవహక్కులను ఉల్లంఘిస్తోంది అక్కడి జుంటా ప్రభుత్వం. సైనిక పాలకులకు ఎదురుతిరిగినా.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినా.. నిర్ధాక్షిణ్యంగా చంపేస్తోంది. ఇప్పటికే అనేక ఆరోపణపై ప్రముఖ నాయకురాలు ఆంగ్ సాంగ్ సూచీని జైలులో నిర్భంధించింది సైన్యం. తమకు వ్యతిరేకంగా ఉంటే దారుణంగా చంపేస్తోంది.
Parliament panel examining Marriage Bill gets another 3 months extension: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బాల్య వివాహాల నిషేధ(సవరణ) బిల్లు 2021ను పరిశీలించే.. విద్యా,మహిళలు, పిల్లలు, యువత, క్రీడల పార్లమెంటరీ స్థాయి సంఘానికి మరో మూడు నెలల గడువును పొడగించారు. రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధంఖర్ పొడగింపును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మహిళల కనీస వివాహ వయస్సు 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ వివాహ బిల్లును తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.
100 MPs support Rishi Sunak in UK PM race: లిజ్ ట్రస్ రాజీనామాతో యూకేలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఆర్థికంగా కుదేలవుతున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టలేక లిజ్ ట్రస్ చేతులెత్తేశారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 45 రోజుల్లోనే రాజీనామా చేశారు. దీంతో మరోసారి బ్రిటన్ ప్రధాని ఎన్నిక అనివార్యం అయింది. ఇదిలా ఉంటే చాలా మంది టోరీ ఎంపీలు, కన్జర్వేటివ్ పార్టీ ప్రతినిధులు రిషి సునక్ ని కాదని లిజ్ ట్రస్ ని ఎన్నుకోవడంపై తప్పు జరిగిందని భావిస్తున్నారు.
A thief called the police fearing a mob attack in Bangladesh: బంగ్లాదేశ్ లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ దొంగ పోలీసులకే ఫోన్ చేసి షాకిచ్చాడు. తనను రక్షించాలని పోలీసులను వేడుకున్నాడు. దొంగతనం చేసి తప్పించుకునే క్రమంలో స్థానిక గుంపుకు చిక్కుతాననే భయంతో తనను కాపాడాలని కోరాడు. కోపంతో ఉన్న గుంపు తనను కొట్టి చంపేస్తాడని భావించిన దొంగ పోలీసుల హెల్ప్ కోరాడు. బంగ్లాదేశ్ దక్షిణ బారిసల్ నగరంలో మూసి ఉన్న దుకాణంలో బుధవారం తెల్లవారుజామున దొంగతనానికి వెళ్లాడు…
Military chopper crashes in Arunachal Pradesh: ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ఘటన మరవక ముందే మరో హెలికాప్టర్ కుప్పకూలింది. అరుణాచల్ ప్రదేశ్ లో శుక్రవారం మిలిటరీ హెలికాప్టర్ కూలింది. ఎగువ సియాంగ్ జిల్లాలోని ఓ గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రెస్క్యూ సిబ్బందిని ఘటన జరిగిన ప్రదేశానికి పంపారు అధికారులు. ప్రయాణికుల సంఖ్య, వారి పరిస్థితి గురించి ఇంకా ఏ వివరాలు తెలియవని ఎగువ సియాంగ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ శాశ్వత్ సౌరభ్ తెలిపారు.
Saudi Arabia has started construction of a 170 km megacity: సౌదీ అరేబియా వినూత్నమైన మెగా సిటీని నిర్మిస్తోంది. తాజాగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. ‘‘ ది లైన్’’ ప్రాజెక్టు పేరుతో నియోమ్ వద్ద 170 కిలోమీటర్ల పొడవుతో మెగా సిటీని నిర్మిస్తోంది. సౌదీలోని వాయువ్య టబుక్ ప్రావిన్సులోని ఎడారిలో ఈ సిటీ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించిన పనులు ప్రారంభం అయిన వీడియో బయటకు వచ్చింది. ఏడారి ప్రాంతంలో వందలాది ట్రక్కులు నిర్మాణంలో…
‘‘Krishna Also Talks Of Jihad To Arjun’’- Congress leader's controversial comments: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్, కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. జీహాద్ అనే భావన కేవలం ఇస్లాం మతంలోనే కాదు.. భగవద్గీత, క్రైస్తవంలో కూడా ఉందని వ్యాఖ్యానించారు. పాటిల్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. మొహసినా కిద్వాయ్ జీవిత చరిత్రను ఆవిష్కరించే సందర్భంగా పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Russian attacks on Ukraine targeting power grid: విద్యుత్ వ్యవస్థే లక్ష్యంగా రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. శీతాకాలం రావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించి దేశం నుంచి వలసలు పెంచాలనే ఆలోచనలతోనే రష్యా ఇలా చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇదే విధంగా రష్యా ఆక్రమిత క్రిమియాలో ఇరాన్ జాతీయులు..కామికేజ్ డ్రోన్లను నిర్వహించేందుకు సహాయపడుతున్నారని అమెరికా, ఉక్రెయిన్ ఆరోపిస్తున్నాయి. రష్యాకు సహాయం చేయడానికి ఇరాన్ తన సిబ్బందిని పంపిందని ఆరోపణలు గుప్పించాయి.
India should colonise Britain- Comedian Trevor Noah’s old video goes viral amid UK crisis: ఒకప్పుడు సూర్యుడు ఆస్తమించని సామ్రాజ్యంగా గొప్పగా చెప్పుకునే యునైటెడ్ కింగ్ డమ్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచానికి పార్లమెంటరీ వ్యవస్థను అందించిన దేశంగా పేరొందిన బ్రిటన్.. ప్రస్తుతం తమను తాము పాలించుకోవడానికి ఇబ్బందులు పడుతోంది. యూకేలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. గతంలో ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత లిజ్ ట్రస్ ప్రధాని బాధ్యతు చేపట్టిన 45 రోజుల్లోనే తన…