Mallikarjun Kharge wins the Congress presidential elections:కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అంతా అనుకున్న ప్రకారం మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. శశిథరూర్ పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. రెండు దశాబ్ధాల తరువాత తొలిసారిగా గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. ఖర్గేకు 7897 ఓట్లు రాగా.. శశి థరూర్ కు కేవలం 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. పార్టీకి 98వ అధ్యక్షుడిగా…
Emmanuel Macron To Visit India Early Next Year: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుమేల్ మక్రాన్ భారత పర్యటనకు రాబోతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆయన భారతదేశాన్ని సందర్శించేందుకు రానున్నారు. ఫ్రెంచ్ మంత్రి క్రిసౌలా జచరోపౌలౌ, భారత సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. మాక్రాన్ 2023 ప్రారంభంలో భారతదేశాన్ని సందర్శించాల్సి ఉందని అన్నారు. మహారాష్ట్రలోని జైతాపూర్ అణువిద్యుత్ రియాక్టర్ల నిర్మాణానికి సంబంధించి పునరుద్ధరణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇండియాకు రానున్నట్లు తెలుస్తోంది.
Partial Solar Eclipse: అక్టోబర్ 25న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది. యూరప్, పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికాల్లో ఈ ఖగోళ అద్భుతం కనువిందు చేయబోతోంది. సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు రావడంతో గ్రహణం ఏర్పడుతుంది. 25 మధ్యాహ్నం ఇండియాలో సూర్యగ్రహణం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. భారతదేశంలో తూర్పు ప్రాంత నగరమైన కోల్‌కతా ప్రజలు తక్కువ సమయం పాటు ఈ సూర్యగ్రహణాన్ని చూడవచ్చు. అయితే ఉత్తర, పశ్చిమ భారతదేశ ప్రాంతాలు […]
Shashi Tharoor comments on congress president elections: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ ఇద్దరూ కూడా తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటి నుంచి శశిథరూర్ అధ్యక్ష ఎన్నికల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఫ్రీ-ఫెయిర్ గా జరగలేదని ఆయన అన్నారు. ఎన్నికలు నిష్ఫక్షపాతంగా జరగలేదని వ్యాఖ్యానించారు. దాదాపుగా […]
Physical assault on woman in Delhi:ఢిల్లీలో మృగాళ్లు దారుణానికి తెగబడ్డారు. ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరోసారి ఢిల్లీ నిర్భయ ఘటనను గుర్తు చేసే విధంగా ప్రవర్తించారు. మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు వ్యక్తులు. తీవ్ర గాయాలపాలైన సదరు బాధిత మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషనర్ సీరియస్ అయ్యారు. అధికారుల […]
EAM S. Jaishankar Comments on india's foreign policies:భారత విదేశాంగ విధానం గురించి విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మంగళవారం అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. నేను ఏం చేస్తున్నానో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. విదేశాంగ శాఖ మంత్రిగా యూఎస్, ఆస్ట్రేలియా మొదలైన దేశాలకు ప్రయాణిస్తున్నానని మీరు చదివి ఉంటారు..కానీ నేను ఏం చేస్తానో, ఓ విదేశాంగ మంత్రి ఏం చేస్తాడో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.
VK Sasikala reacts to Arumughaswamy commission’s report: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణంపై అరుముగస్వామి కమిషన్ ఆ రాష్ట్రంలో హీట్ పెంచుతోంది. కమిషన్ ఇచ్చిన రిపోర్టు రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అయితే కమిషన్ జయలలిత స్నేహితురాలు వీకే శశికళతో పాటు మరో ముగ్గురిపై అనుమానాలు ఉన్నాయనే రిపోర్టును ఆమె వ్యతిరేకించారు. జయలలిత చికిత్సలో తానెప్పుడు కలుగచేసుకోలేదని, ఆమె మరణంలో నా పాత్ర లేదని అన్నారు. తమిళనాడు అసెంబ్లీలో మంగళవారం అరుముగస్వామి రిపోర్టును ప్రవేశపెట్టారు.
China Blocks India-US Move At UN Again On Blacklisting Pak-Based Terrorist: డ్రాగన్ దేశం చైనా మరోసారి తన భారత వ్యతిరేకతను ప్రదర్శించిది. తన మిత్రదేశం పాకిస్తాన్ దేశానికి వంతపాడింది చైనా. ప్రపంచంలో ఉగ్రవాదానికి కేంద్రంగా పాకిస్తాన్ ఉందని అన్ని దేశాలకు తెలుసు. భారతదేశంపైకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎప్పటికప్పడు ఎగదోస్తుంటుంది పాకిస్తాన్. అయినా కూడా తాము ఉగ్రవాద బాధితులమే అని మొసలి కన్నీరు కారుస్తుంటుంది.
Snake on Plane: సాధారణంగా మన ఇంటికి పాములు వస్తే చాలా కంగారు పడుతుంటాము. అది వెళ్లిపోయే వరకు లేకపోతే చంపే వరకు నిద్రపోము. అలాంటిది విమానంలో పాము కనిపిస్తే ఎలా ఉంటుంది. ప్రయాణికులు ఎంతగా ఆందోళన చెందుతారో ఊహించుకోంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే అమెరికాలో జరిగింది. ప్రయాణికులు పామును గుర్తించడంతో విమానాన్ని తనిఖీ చేసి పామును బయటకు తీశారు.
Elon Musk's SpaceX Seeks Licence To Launch Starlink Broadband In India: భారతదేశంలోకి అడుగు పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ఎక్స్ సిద్ధం అవుతోంది. దేశంలో ప్రతిష్టాత్మకంగా 5జీ సేవలను ప్రారంభించింది ప్రభుత్వం. దీంతో ప్రపంచదేశాలకు చెందిన పలు కంపెనీలు భారత్ లో అంతరిక్ష వ్యాపారాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ తన స్టార్ లింక్ బ్రాండ్‌తో భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్-ఫ్రమ్-స్పేస్ సేవలను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. శాటిలైట్ సర్వీసెస్ కోసం టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ (డీఓటీ)కి దరఖాస్తు చేసింది. స్పేస్ఎక్స్ దరఖాస్తు…