Infosys delays onboarding date again: కొత్తగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా చేరాలనుకునే యువతకు మరోసారి నిరాశే ఎదురైంది. ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్ తేదీని మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. గత నాలుగు నెలలుగా కొత్త ఉద్యోగులు చేరికను వాయిదా వేస్తూ వస్తోంది ఇన్ఫోసిస్. మొదటిసారిగా సెప్టెంబర్ 12, 2022 చేరిక తేదీని నిర్ణయించారు. ఆ తరువాత ప్రస్తుతం డిసెంబర్ 19, 2022కు మార్చారు. గత నాలుగు నెలల్లో నాలుగు సార్లు ఆన్‌బోర్డింగ్ తేదీని వాయిదా వేసింది.
దీంతో ఉద్యోగంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నవారు ఆందోళనకు గురువుతున్నారు. సెప్టెంబర్ 12, అక్టోబర్, నవంబర్ 28, డిసెంబర్ 19 ఇలా వాయిదాలు వేస్తూ పోతున్నారని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. చాలా మంది ఉద్యోగం, ఆదాయం లేకుండా ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కంపెనీ తమ ఆఫర్ లెటర్ క్యాన్సిల్ చేస్తారని చాలా మంది భయపడుతున్నారు. ఇటీవల కొత్తవారిని తీసుకున్న తరువాత టెక్ మహీంద్రా, విప్రో, వంటి కంపెనీలు ఆఫ్ లెటర్ రద్దు చేసుకున్నాయి. దీంతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారి భయాలు పెరుగుతున్నాయి.
Read Also: PM Narendra Modi: ప్రధాని చేతుల మీదుగా డీబీయూల ప్రారంభం.. జాతికి అంకితం చేయనున్న మోదీ
అయితే ఐటీ కంపెనీలు మాత్రం మేము మా వ్యాపార అవసరాల ఆధారంగా డేట్ ఆఫ్ జాయినింగ్ కేటాయిస్తామని తెలిపుతున్నాయి. ఉద్యోగులు చేరికకు కనీసం 2-3 వారాల ముందు సమాచారాన్ని పంపిస్తామని చెబుతున్నాయి. గత మూడు నాలుగు నెలల క్రితం ఐటీ ఇండస్ట్రీలో ఫ్రెషర్లకు ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు వచ్చాయి. చాలా కంపెనీలు కొత్తవాళ్లను తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచమాంద్యం ఏర్పడుతున్న ఈ పరిస్థితుల్లో కొత్త ఉద్యోగులను తీసుకునేందుకు కంపెనీలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్ దుర్వినియోగం చేస్తూ.. రెండు ఉద్యోగాలు చేసేవారికి వార్నింగ్ ఇస్తున్నాయి. మూన్ లైటింగ్ విధానంలో రెండు ఉద్యోగాలు చేసే వారిని గుర్తించిన ఇటీవల 300 మందిని తొలగించింది విప్రో. ఇతర కంపెనీలు కూడా విప్రో బాటలో నిడిచేందుకు సిద్దం అవుతున్నాయి.