Prime Minister Modi will visit Kedarnath: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కేదార్ నాథ్ పర్యటనకు ఉత్తరాఖండ్ వేళ్లనున్నారు. రూ.3,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి మోదీ కేదార్ నాథ్, బద్రీనాథ్ సందర్శించనున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు కేదార్ నాథ్ ఆలయంలో ప్రార్థనలు, పూజలు చేయనున్నారు. కేదార్ నాథ్ రోప్ వే ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Omicron may cause another corona wave..WHO warning: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. మహమ్మారి ముప్పు పూర్తిగా తొలిగిపోలేదు. ఇప్పటికే చాలా దేశాల్లో కరోనా వేరియంట్ ఓమిక్రాన్ నుంచి సబ్ వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ ఇలా వరస వేరియంట్లు కరోనా వేవ్ లకు కారణం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓమిక్రాన్ సబ్ వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా మరో కోవిడ్-19 వేవ్ కు కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.
Couple’s fight over 'cooking mutton on Tuesday' kills neighbour: సాధారణంగా ఇరుగుపొరుగు కుటుంబాలు ఎంతోకొంత స్నేహంగా ఉంటాయి. కొన్ని సార్లు గొడవులు జరిగితే సర్దిచెబుతుంటారు పక్కింటి వారు. అయితే ఈ ఘటనను చూస్తే వేరేవారి విషయాల్లో కలుగుజేసుకోవాలనుకునే పొరుగింటి వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భార్యభర్తల గొడవలను ఆపేందుకు వెళ్లిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
USA should be ready to stop Chinese invasion says US Official: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో చైనా కూడా తైవాన్ ద్వీపాన్ని ఎప్పుడైనా ఆక్రమించుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సమావేశాల్లో అధ్యక్షడు జిన్ పింగ్, తైవాన్ అంశాన్ని ప్రత్యేకంగా లేవనెత్తారు. చైనా సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తే చూస్తు ఊరుకోం అని హెచ్చరికలు జారీ చేశారు. చైనాకు వ్యతిరేకంగా తైవాన్ దేశాన్ని రక్షించేందుకు ఇప్పుడే సిద్ధంగా ఉండాలని అమెరికా సీనియర్ అధికారి సూచించారు.
James Webb Telescope Captures The Iconic "Pillars Of Creation": నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అద్భుతాలను సృష్టిస్తోంది. సుదూర విశ్వంలోని అద్భుత దృశ్యాలను సంగ్రహిస్తోంది. విశ్వం పుట్టుకకు సంబంధించిన కీలక విషయాలను వెలుగులోకి తీసుకువస్తోంది. ఇప్పటి అనంత విశ్వానికి సంబంధించిన చిత్రాలను భూమికి పంపించింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. తాజాగా విశ్వంలోని ‘‘ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్’’ చిత్రాలను తీసింది.
Fired Top Leader In 10 Minutes says Wipro Boss: సంస్థ సమగ్రతకు భంగం వాటిల్లేలా ఎవరు ప్రయత్నించినా వదిలేది లేదంటోంది ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో. ఇటీవల 300 మంది ఉద్యోగులను తొలగించి వార్తల్లో నిలిచింది. సంస్థలో పనిచేస్తూనే వేరే కంపెనీలకు పనిచేస్తూ ‘‘ మూన్ లైటింగ్’’కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని సంచలనం సృష్టించింది. విప్రో బాస్ రిషద్ ప్రేమ్ జీ మూన్ లైటింగ్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని మోసంగా అభివర్ణిస్తున్నారు ఆయన.
BJP MLA's Controversial Comments on Hindu Gods: బీహార్ బీజేపీ ఎమ్మెల్యే హిందూ దేవీదేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అయ్యాయి. భాగల్పూర్ జిల్లాలోని పిర్పైంటి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ హిందువుల విశ్వాసాలను ప్రశ్నించారు. తన వైఖరిని నిరూపించుకోవడానికి కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రాజేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై భాగల్ పూర్ లోని షెర్మారీ బజార్ లో ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించి, దిష్టి బొమ్మ…
Millions In Britain Skipping Meals To Tackle Cost-Of-Living Crisis: యునైటెడ్ కింగ్ డమ్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. లిజ్ ట్రస్ ప్రధాని అయిన తర్వాత అక్కడ విద్యుత్ ధరలను ఫ్రీజ్ చేయడంతో రానున్న కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంచానా వేస్తున్నారు. ప్రస్తుతం ఖర్చులను తగ్గించుకునేందుకు బ్రిటన్ వాసులు భోజనాలను తగ్గించుకుంటున్నారు. సెప్టెంబర్ నెలలో యూకేలో ద్రవ్యోల్భనం 10 శాతాని కన్నా ఎక్కువ అయింది. దీంతో విపరీతంగా ఆహారధరలు పెరిగాయి.
Tiger attack in Maharashtra.. Two killed: మహారాష్ట్రలో పులులు బీభత్సం సృష్టిస్తున్నాయి. చంద్రపూర్ జిల్లాలో ఇద్దరు పశువుల కాపర్లపై దాడి చేసి హతమార్చింది ఓ పెద్దపులి. జల్లాలోని మూతాలాకా చించాడా గ్రామానికి చెందిన నానాజీ నీకేసర్(53), దివరూ వసలేకర్(55) ఇద్దరు పశువులను మేపేందుకు సమీపంలో అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఈ సమయంలో వీరిద్దరిపై పులి పంజా విసిరింది. దీంతో వారిద్దరు మరణించారు. దీంతో స్థానికంగా ఉన్న గ్రామస్థులు భయాందోళనకు గురువుతున్నారు. ఇటీవల కాలంలో చంద్రపూర్, గడ్చిరోలి […]
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. వరసగా క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన నగరాలను ధ్వంసం చేస్తోంది. ముఖ్యంగా విద్యుత్ గ్రిడ్ లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇరాన్ నుంచి తీసుకున్న ‘‘ కామికేజ్’’ డ్రోన్లతో విద్యుత్ గ్రిడ్స్, మౌళిక సదుపాయాలపై దాడులు చేస్తోంది. రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియాలోని కేర్చ్ బ్రిడ్జ్ ను కూల్చేసిన తర్వాత ఉక్రెయిన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది రష్యా. రానున్న శీతాకాలం దృష్ట్యా రష్యా వ్యూహాత్మకంగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది.