Bangladesh: ‘‘అతడి రక్తం వృధా కాదు’’.. హాది అంత్యక్రియల్లో భారత వ్యతిరేక నినాదాలు..
- ఢాకాలో లక్షలాది మధ్య హాది అంత్యక్రియలు..
- భారత్ వ్యతిరేక నినాదాలు చేసిన గుంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో రాడికల్ మతోన్మాద విద్యా్ర్థి నాయకుడు షరీప్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత హింస చెలరేగింది. డిసెంబర్ 12న ఢాకాలో అతడిని ఇద్దరు వ్యక్తులు అతి దగ్గర నుంచి కాల్చి, తీవ్రంగా గాయపరిచారు. డిసెంబర్ 19న హాది చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, ఇతడి మరణం తర్వాత బంగ్లాదేశ్ భగ్గుమంది. రాడికల్ శక్తులు మళ్లీ అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. మైమన్‌సింగ్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తిని దైవదూషణ ఆరోపణతో హత్య చేశారు.
Read Also: Bangladesh: బంగ్లా జాతీయ కవి పక్కనే రాడికల్ హాది అంత్యక్రియలు.. ఎందుకు ఇలా చేశారు?
Also Read
- Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
- US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే, శనివారం హాది అంత్యక్రియలు జరిగాయి. ఢాకాలో జరిగిన ఈ కార్యక్రమానికి లక్షలాది మంది జనం తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ప్రజలు గుంపులుగా మణిక్ మియా అవెన్యూ వైపు చేరుకున్నారు. పార్లమెంట్ సముదాయం ఉన్న ఈ ప్రాంతం అంతా జనాలతో నిండిపోయింది. జాతీయ సంసద్ భవన్ సౌత్ ప్లాజాలో జరిగిన అంత్యక్రియల కోసం అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బాడీ కెమెరాలతో కూడిన పోలీసు అధికారులు ఢాకా అంతటా మోహరించారు. బంగ్లాదేశ్ జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే హాదిని ఖననం చేశారు.
ఇదిలా ఉంటే, అంత్యక్రియల్లో పాల్గొన్న జనాలు భారత వ్యతిరేక నినాదాలు చేయడం గమనార్హం. గుంపులో చాలా మంది ‘‘ఢిల్లీనా లేక ఢాకానా- ఢాకా, ఢాకా’’ అంటూ నినాదాలు చేయడం వినిపించింది. ‘‘మా సోదరుడు హాది రక్తాన్ని వృధా కానివ్వం’’ అని నినాదాలు చేశారు. హాదీ, గతేడాది షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన సంఘటనలో కీలకంగా వ్యవహరించాడు. హాది హత్య తర్వాత నిందితులు భారత్ పారిపోయి ఉండొచ్చని అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికలకు ముందు మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!