Saudi Arabia: వెడల్పు 200 మీటర్లు, పొడవు 170 కిలోమీటర్లు.. మెగాసిటీని నిర్మిస్తున్న సౌదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi Arabia has started construction of a 170 km megacity: సౌదీ అరేబియా వినూత్నమైన మెగా సిటీని నిర్మిస్తోంది. తాజాగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. ‘‘ ది లైన్’’ ప్రాజెక్టు పేరుతో నియోమ్ వద్ద 170 కిలోమీటర్ల పొడవుతో మెగా సిటీని నిర్మిస్తోంది. సౌదీలోని వాయువ్య టబుక్ ప్రావిన్సులోని ఎడారిలో ఈ సిటీ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించిన పనులు ప్రారంభం అయిన వీడియో బయటకు వచ్చింది. ఏడారి ప్రాంతంలో వందలాది ట్రక్కులు నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి.
2017లో మొదటిసారిగా ఈ ప్రాజెక్టును ప్రకటించింది సౌదీ అరేబియా. పలువురు ఆర్కిటెక్చర్లు, ఆర్థికవేత్తలు దీని సాధ్యాసాధ్యాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ మెగాసిటీ పనులు ప్రారంభం అయ్యాయి. ఫ్లయింగ్ టాక్సీలు, రోబోట్స్ ఉపయోగం, గ్రీన్ ఎనర్జీ, ఏఐ మొదలైనవి ఈ సిటీలో ఉపయోగించనున్నారు. పూర్తిగా అద్దంతో కప్పబడిన స్కై లైన్స్ ను సమాంతరంగా 170 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. దీని వెడల్పు కేవలం 200 మీటర్లు మాత్రమే. సముద్ర మట్టానికి 500 ఎత్తులో ఈ నిర్మాణాన్ని నిర్మిస్తోంది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
Read Also: Shivraj Patil: కృష్ణుడు, అర్జునుడికి “జీహాద్” గురించి చెప్పాడు..
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. పవన, సౌర, హైడ్రోజన్ శక్తితో సహా అన్ని రకాల పునరుత్పాదక శక్తితో ఈ మెగాసిటీ నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచంలో పూర్తిగా నడిచే మొదటి నగరంగా ఇది రికార్డులకెక్కబోతోంది. ప్రకృతితో సహజీవనం చేసే విధంగా.. పూర్తిగా పునరుత్పాదక శక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దీన్ని సౌదీ ప్రభుత్వం నిర్మిస్తోంది. ది లైన్ ప్రాజెక్టులో రోడ్లు, కార్లు ఏం ఉండవు. ఇది 100 శాతం పునరుత్పాదక శక్తితో నడుస్తుంది. 95 శాతం భూభాగం ప్రకృతి కోసం వినియోగించనున్నారు. సంప్రదాయ నగరాల మాదిరి కాకుండా..ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యూఏఈ, సౌదీ వంటి దేశాలు మెగా ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ప్రస్తుతం ఈ దేశాలు పూర్తిగా చమురుపై ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా.. ఏదో రోజు ఈ నిల్వలు అడుగంటి పోతాయని తెలిసే ఈ దేశాలు పర్యాటక రంగం, స్థిరాస్తి రంగాలక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే యూఏఈ బుర్జ్ ఖలీపా, పామ్ ఐలాండ్స్ వంటి మెగా ప్రాజెక్టును తీసుకువచ్చింది. ప్రస్తుతం సౌదీ అరేబియా ఈ మెగా ప్రాజెక్టును చేపట్టింది.
The Line project 🇸🇦#NEOM#vision_2030 pic.twitter.com/kWtjhxIHuu
— جلوي آل رشيد 🇸🇦 (@Alyami2030P) October 16, 2022
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!