Parliament panel examining Marriage Bill gets another 3 months extension: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బాల్య వివాహాల నిషేధ(సవరణ) బిల్లు 2021ను పరిశీలించే.. విద్యా,మహిళలు, పిల్లలు, యువత, క్రీడల పార్లమెంటరీ స్థాయి సంఘానికి మరో మూడు నెలల గడువును పొడగించారు. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధంఖర్ పొడగింపును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మహిళల కనీస వివాహ వయస్సు 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ వివాహ బిల్లును తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.
Read Also: Rishi Sunak: యూకే పీఎం రేసులో రిషి సునక్.. 100 మంది ఎంపీల మద్దతు..
పార్లమెంటరీ స్థాయి సంఘానికి అక్టోబర్ 24,2022 నుంచి మరో మూడు నెలల కాలవ్యవధి పెంచింది. గతంలో మార్చి నెలలో మూడు నెలల పాటు ఇలాగే పొడగించారు. బాల్య వివాహాల నిషేధ ( సవరణ) చట్టం 2021 బిల్లును గతేడాది శీతాకాల సమావేశాల్లో లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై అప్పట్లో రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే పార్లమెంటరీ పరిశీలన కోసం స్టాండింగ్ కమిటీకి పంపారు. వర్షాకాల సమావేశాల్లో నివేదిక ప్రవేశపెట్టాలి కానీ చైర్మన్ గా ఉన్న వినయ్ సహస్రబుద్ధే రాజీనామా చేశారు. ఆ తరువాత బీజేపీ ఎంపీ వివేక్ ఠాకూర్ చైర్మన్ గా నియమితులయ్యారు.
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లో ఉన్న లింగసమానత్వాన్ని తీసుకురావడానికి, స్త్రీలను పురుషులను సమానంగా చూసే విధంగా ప్రభుత్వ ఈ బిల్లును తీసుకువచ్చినట్లు చెబుతోంది. ప్రసూతి మరణాల రేటు, శిశు మరణాల రేటు, పోషకాహార స్థాయిలను మెరుగుపరిచేందుకు, లింగ నిష్పత్తి పెరుగుదల కోసం కేంద్ర మహిళల వివాహ కనీస వయసును 18 ఏళ్ల నుంచి 21వరకు పెంచినట్లు కేంద్ర చెబుతోంది.