CM Revanth Reddy: డిసెంబర్ ఒక మిరాకిల్ మంత్.. క్రిస్మస్ పండుగ ప్రేమ, సేవ, త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుంది!
- ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..
- ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి జరుపుకునే పండుగా క్రిస్మస్..
- ద్వేషించే వారిని కూడా ప్రేమించే గుణాన్ని స్ఫూర్తిగా నింపారు ఏసు ప్రభువు..
- కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ ఒక మిరాకిల్ మంత్: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరుపుకునే పండుగగా క్రిస్మస్.. ద్వేషించే వారికి కూడా ప్రేమించే గుణాన్ని ఏసు ప్రభువు మానవాళికి స్ఫూర్తిగా అందించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ ఒక మిరాకిల్ మంత్‌గా మారిందని వ్యాఖ్యానించారు. రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి నష్టం జరిగినప్పటికీ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also: Tata Motors 2026 Cars: కొత్త సంవత్సరంలో టాటా మోటార్స్ లాంచ్ చేసే కార్లు ఇవే!
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
అయితే, గతంలో సోనియా గాంధీ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌ను తీసుకొచ్చి పేదలకు భరోసా కల్పించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈరోజు తెలంగాణలో తమ ప్రభుత్వం పేదలకు దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. అలాగే, విద్య, వైద్యం లాంటి కీలక సేవలను ప్రభుత్వంతో సమానంగా క్రిస్టియన్ మిషనరీలు కూడా పేదలకు అందిస్తూ, సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, సేవ, త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుంది.. ఆ విలువలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!