A thief called the police fearing a mob attack in Bangladesh: బంగ్లాదేశ్ లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ దొంగ పోలీసులకే ఫోన్ చేసి షాకిచ్చాడు. తనను రక్షించాలని పోలీసులను వేడుకున్నాడు. దొంగతనం చేసి తప్పించుకునే క్రమంలో స్థానిక గుంపుకు చిక్కుతాననే భయంతో తనను కాపాడాలని కోరాడు. కోపంతో ఉన్న గుంపు తనను కొట్టి చంపేస్తాడని భావించిన దొంగ పోలీసుల హెల్ప్ కోరాడు. బంగ్లాదేశ్ దక్షిణ బారిసల్ నగరంలో మూసి ఉన్న దుకాణంలో బుధవారం తెల్లవారుజామున దొంగతనానికి వెళ్లాడు యాసిన్ ఖాన్(40). ఇతను వృత్తిరీత్యా దొంగతనానికి పాల్పడుతుంటాడు.
Read Also: Dasoju Sravan: బీజేపీకి ఊహించని షాకిచ్చిన దాసోజు.. మళ్లీ కారెక్కుతున్నాడు..
అయితే కిరాణా షాపులోకి చొరబడి అల్మారాల్లోని వస్తువులను దొంగిలించాడని స్థానిక పోలీస్ చీఫ్ అసద్ ఉజ్ జమాన్ తెలిపారు. కాగా.. దొంగతనం పనిముగించుకున్న తర్వాత తెల్లారిందని, ప్రజలు మార్కెట్ కు రావడం ప్రారంభించారని గ్రహించాడు. ఈ సమయంలో స్థానిక గుంపుకు దొరికితే తీవ్రంగా కొడతారనే భయంతో పోలీస్ ఎమర్జెన్సీ లైన్ కు కాల్ చేసి రక్షించాలని వేడుకున్నాడు.
మేము దుకాణానికి వెళ్లి అతడిని బయటకు తీసుకువచ్చామని.. ప్రజల గుంపు అతడిని కొట్టకుండా ముందే మా కస్టడీలోకి తీసుకున్నామని పోలీస్ అధికారి జమాన్ తెలిపారు. నా కెరీర్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదని.. ఇదే తొలిసారని ఆయన అన్నారు. దుకాణం యజమాని జొంతు మియా మాట్లాడుతూ.. దొంగ యాసిన్ ఖాన్ విలువైన వస్తువులతో పెద్ద బ్యాగ్ నింపాడని.. అయతే షాపు నుంచి తప్పించుకోలేక పోయాడని చెప్పాడు. ఖాన్ ను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషణ్ కు తరలించారు. ఈ ప్రాంతంలో అనేెక చోరీల్లో యాసిన్ ఖాన్ ను వెతుకుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.