PM Modi: మే 4 తర్వాత బెంగాల్‌లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- మే 4న బెంగాల్‌లో అధికారం బీజేపీదే..
- అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫియా అంతం..
- టీఎంసీ ల్యాండ్ మాఫియా, సిండికేట్లను ప్రోత్సహించింది..
- రెండో విడత ప్రచారంలో విరుచుకుపడిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: మే 4 తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం ఆయన బెంగాల్ రెండో విడత పోలింగ్‌కు సంబంధించి ప్రచారంలో పాల్గొన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని జరిగిన ఓ ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. టీఎంసీ బెంగాల్ భూమిని, చొరబాటుదారులకు అప్పగించిందని, టీఎంసీ బెంగాల్ తల్లిని ఏడ్పించిందని ఆరోపించారు. టీఎంసీ అరాచక పాలన నుంచి బెంగాల్ ఇప్పుడు స్వేచ్ఛ కొరుకుంటోందని, తొలి విడత ఎన్నికలతో తృణమూల్ అహంకారం బద్ధలైందని ప్రధాని అన్నారు.
Read Also: Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
15 ఏళ్ల క్రితం టీఎంసీ ‘‘మా-మాటి-మనుష్’’(తల్లి, భూమి, ప్రజలు) అనే నినాదంలో అధికారంలోకి వచ్చిందని, కానీ ఈ రోజు టీఎంసీ ఆ మాటలు మాట్లాడటం లేదని, వారు బెంగాల్ భూమిని ల్యాండ్ సిండికేట్లు, మాఫియా, చొరబాటుదారులకు అప్పగించిందని, బెంగాల్ ప్రజలు వలస వెళ్లేలా చేసిందని ప్రధాని మోడీ ఆరోపించారు.
మే 4 తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ఇక్కడి మహిళల్ని హింసించిన గుండాల సంగతి బీజేపీ ప్రభుత్వం తేలుస్తుందని, మాఫియా పాలన అంతం కావడం ఖాయమని అన్నారు. మొదటి దశలో బెంగాల్ కనబరిచిన అద్భుతమైన ప్రదర్శన, రెండో దశలో బీజేపీ భారీ విజయాన్ని ఖరారు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఎంసీ దురాగతాలను సమూలంగా నిర్మూలించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!