Hyundai Ioniq 5: లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో హ్యుందాయ్ నుంచి ఐయోనిక్ 5 వస్తోంది. ఈ కారుకు ఇండియాలో యమ క్రేజ్ ఏర్పడింది. తొలి ఏడాదిలో 250-300 కార్లను డెలివరీ చేయాలని హ్యుందాయ్ భావించింది. అయితే దీనికి రెండింతల బుకింగ్స్ అయ్యాయి. ఇప్పటి వరకు 650కి పైగా ఐయోనిక్ 5 బుకింగ్స్ జరిగాయి. డిసెంబర్ 2022లో ఐయోనిక్ 5 ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. ఇప్పటి వరకు 650 కార్లు బుక్ అయ్యాయి. వీటిని వచ్చే నెల మార్చి నుంచి కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.
Read Also: Revanth Reddy : ప్రగతి భవన్ కూడా కూల్చివేయాలి.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మనదేశంలో ఐయోనిక్ 5 ఈవీ ధర రూ. 44.95 (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఐయోనిక్ 5ని దేశంలోని హ్యుందాయ్ చెన్నై ఫ్లాంట్ లో అసెంబుల్ చేస్తున్నారు. దీంతో ఈ కారు ధర తక్కువగా ఉండటానికి కారణం. ప్రస్తుతం కియా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ ఈవీ 6కు హ్యుందాయ్ ఐయోనిక్ ప్రత్యర్థిగా ఉండబోతోంది. రెట్రో-ఫ్యూచరిస్టిక్ లుక్ తో ఐయోనిక్ వస్తోంది. దీంతో అత్యాధునిక సాంకేతికత ఈ కారులో ఉపయోగించారు. డ్యాష్ బోర్డు చాలా లగ్జరీగా ఉంది. క్యాబిన్ లో రెండు పెద్ద 12.3 అంగుళాల స్క్రీన్లు ఉన్నాయి. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ, ట్రాక్షన్ కంట్రోల్, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్(ADAS) ఫీచర్లు కారులో ఉన్నాయి. 8-స్పీకర్ బోస్ సౌడ్ సిస్టం, ఆటో క్లైమెట్ కంట్రోల్, ఆన్ బోర్డ్ నావిగేషన్ ఉన్నాయి.
హ్యుందాయ్ నుంచి ఇప్పటికే కోనా ఎలక్ట్రిక్ కార్ ఉంది. తాజా ఐయోనిక్ 5న తన రెండో ఈవీగా మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. నిజానికి దేశంలో అన్నింటి కన్నా ముందుగానే హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఐయోనిక్ 5లో 72.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ తో 631 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. ఈ కారులో ఉన్న పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ 215 బీహెచ్పీ సామర్థ్యంతో 350ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది.