రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POCO C81 Series: పోకో (POCO) భారత మార్కెట్లో కొత్తగా బడ్జెట్ 4G ఫోన్లు POCO C81X, POCO C81లను అధికారికంగా లాంచ్ చేసింది. తక్కువ ధరలో మంచి హార్డ్‌వేర్, పెద్ద బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో ఈ ఫోన్లు వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ గా నిలవనున్నాయి.
డిస్ప్లే & డిజైన్:
POCO C81Xలో 6.88 అంగుళాల డిస్ప్లే ఉండగా, POCO C81లో 6.9 అంగుళాల పెద్ద స్క్రీన్ అందించారు. రెండింటిలోనూ 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్మూత్ అనుభవం లభిస్తుంది. C81లో 800 నిట్స్ బ్రైట్నెస్, C81Xలో 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. ‘వెట్ టచ్ టెక్నాలజీ 2.0 ‘ వల్ల చేతులు తడిగా ఉన్నా కూడా టచ్ రిస్పాన్స్ బాగుంటుంది. ఐ కంఫర్ట్ ఫీచర్లు కళ్లపై ఒత్తిడి తగ్గిస్తాయి.
Also Read
- Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
- ISRO NVS-03 Satellite: నేడు రాత్రి 11:51 గంటలకు ఇస్రో కీలక ప్రయోగం.. నింగిలోకి NVS-03 ఉపగ్రహం!
- మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
- IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
పర్ఫార్మెన్స్:
ఈ ఫోన్లు UNISOC T7250 ప్రాసెసర్‌తో వస్తాయి. 4GB వరకు ర్యామ్ తో పాటు అదనంగా వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంది. POCO C81లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత Xiaomi HyperOS 3 ఉండగా, C81Xలో ఆండ్రాయిడ్ 15తో HyperOS 2 ఉంది. గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
కెమెరా ఫీచర్లు:
POCO C81 సిరీస్‌లో 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. HDR+, నైట్ మోడ్ వంటి ఫీచర్లు ఫోటోగ్రఫీకి సహాయపడతాయి. AI Sky ఫీచర్ ద్వారా ఫోటోల్లో ఆకాశాన్ని మార్చుకోవచ్చు. ఇంకా డాక్యుమెంట్ మోడ్ తో డాక్యుమెంట్లను స్కాన్ చేయవచ్చు.
బ్యాటరీ:
POCO C81Xలో 5200mAh బ్యాటరీ ఉండగా, POCO C81లో 6300mAh భారీ బ్యాటరీ ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అదనంగా సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, IP52 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్, డ్యూయల్ సిమ్, Wi-Fi, బ్లూటూత్ వంటి అన్ని అవసరమైన ఫీచర్లు ఉన్నాయి.
ధర:
POCO C81X 3GB + 64GB ధర రూ. 9,999 కాగా, POCO C81 4GB + 64GB ధర రూ. 10,999గా నిర్ణయించారు. ఈ ఫోన్లు ఏప్రిల్ 27 నుంచి ఫ్లిప్‌కార్ట్ లో అమ్మకాలకు అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!