A thief called the police fearing a mob attack in Bangladesh: బంగ్లాదేశ్ లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ దొంగ పోలీసులకే ఫోన్ చేసి షాకిచ్చాడు. తనను రక్షించాలని పోలీసులను వేడుకున్నాడు. దొంగతనం చేసి తప్పించుకునే క్రమంలో స్థానిక గుంపుకు చిక్కుతాననే భయంతో తనను కాపాడాలని కోరాడు. కోపంతో ఉన్న గుంపు తనను కొట్టి చంపేస్తాడని భావించిన దొంగ పోలీసుల హెల్ప్ కోరాడు. బంగ్లాదేశ్ దక్షిణ బారిసల్ నగరంలో మూసి ఉన్న దుకాణంలో బుధవారం తెల్లవారుజామున దొంగతనానికి వెళ్లాడు…
Military chopper crashes in Arunachal Pradesh: ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ఘటన మరవక ముందే మరో హెలికాప్టర్ కుప్పకూలింది. అరుణాచల్ ప్రదేశ్ లో శుక్రవారం మిలిటరీ హెలికాప్టర్ కూలింది. ఎగువ సియాంగ్ జిల్లాలోని ఓ గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రెస్క్యూ సిబ్బందిని ఘటన జరిగిన ప్రదేశానికి పంపారు అధికారులు. ప్రయాణికుల సంఖ్య, వారి పరిస్థితి గురించి ఇంకా ఏ వివరాలు తెలియవని ఎగువ సియాంగ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ శాశ్వత్ సౌరభ్ తెలిపారు.
Saudi Arabia has started construction of a 170 km megacity: సౌదీ అరేబియా వినూత్నమైన మెగా సిటీని నిర్మిస్తోంది. తాజాగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. ‘‘ ది లైన్’’ ప్రాజెక్టు పేరుతో నియోమ్ వద్ద 170 కిలోమీటర్ల పొడవుతో మెగా సిటీని నిర్మిస్తోంది. సౌదీలోని వాయువ్య టబుక్ ప్రావిన్సులోని ఎడారిలో ఈ సిటీ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించిన పనులు ప్రారంభం అయిన వీడియో బయటకు వచ్చింది. ఏడారి ప్రాంతంలో వందలాది ట్రక్కులు నిర్మాణంలో…
‘‘Krishna Also Talks Of Jihad To Arjun’’- Congress leader's controversial comments: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్, కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. జీహాద్ అనే భావన కేవలం ఇస్లాం మతంలోనే కాదు.. భగవద్గీత, క్రైస్తవంలో కూడా ఉందని వ్యాఖ్యానించారు. పాటిల్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. మొహసినా కిద్వాయ్ జీవిత చరిత్రను ఆవిష్కరించే సందర్భంగా పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Russian attacks on Ukraine targeting power grid: విద్యుత్ వ్యవస్థే లక్ష్యంగా రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. శీతాకాలం రావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించి దేశం నుంచి వలసలు పెంచాలనే ఆలోచనలతోనే రష్యా ఇలా చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇదే విధంగా రష్యా ఆక్రమిత క్రిమియాలో ఇరాన్ జాతీయులు..కామికేజ్ డ్రోన్లను నిర్వహించేందుకు సహాయపడుతున్నారని అమెరికా, ఉక్రెయిన్ ఆరోపిస్తున్నాయి. రష్యాకు సహాయం చేయడానికి ఇరాన్ తన సిబ్బందిని పంపిందని ఆరోపణలు గుప్పించాయి.
India should colonise Britain- Comedian Trevor Noah’s old video goes viral amid UK crisis: ఒకప్పుడు సూర్యుడు ఆస్తమించని సామ్రాజ్యంగా గొప్పగా చెప్పుకునే యునైటెడ్ కింగ్ డమ్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచానికి పార్లమెంటరీ వ్యవస్థను అందించిన దేశంగా పేరొందిన బ్రిటన్.. ప్రస్తుతం తమను తాము పాలించుకోవడానికి ఇబ్బందులు పడుతోంది. యూకేలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. గతంలో ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత లిజ్ ట్రస్ ప్రధాని బాధ్యతు చేపట్టిన 45 రోజుల్లోనే తన…
Ghaziabad woman’s physical assault case false conspiracy: ఢిల్లీ-ఘజియాబాద్ రేప్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఐదుగురిని ఇరికించే ప్రయత్నంలో సదరు మహిళ గ్యాంగ్ రేప్ డ్రామా ఆడినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళ రెండు రోజుల క్రితం ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ రోడ్డు పక్కన పడి ఉండటాన్ని గుర్తించిన పోలీసుల.. ఆమె చెప్పినదాని ప్రకారం ముందుగా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. విచారణలో భాగం మహిళ ఆస్తి వివాదంలో కట్టుకథ అల్లినట్లు […]
Chinese woman arrested on allegations of spying: తన గుర్తింపు దాచి పెడుతూ.. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగాలపై గురువారం ఓ చైనా మహిళను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. బౌద్ధ సన్యాసిగా జీవిస్తూ.. చైనా తరుపున గూఢచర్య చేస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నకిలీ గుర్తింపు కార్డుతో భారతదేశంలో నివసిస్తూ.. దేశ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై చైనా మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Hindu girl forcibly converted to Islam sent to safe home by court after social media outrage: పాకిస్తాన్ దేశంలో ఇటీవల వరసగా హిందూ బాలికలు, మహిళలు కిడ్నాపుకు గురవుతున్నారు. సింధు ప్రావిన్సులో గత నెల ఇద్దరు బాలికలు కిడ్నాప్ కాగా.. పెళ్లయిన యువతిని కూడా ఇలాగే కిడ్నాప్ చేశారు. ఇటీవల కొన్ని వారం రోజుల క్రితం 14 ఏళ్ల బాలికను, ఈ వారంలో మరో ఇద్దరు బాలికను ఇలాగే కిడ్నాప్ చేశారు. […]
60 killed in anti-government protests in Chad: చాద్ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు మిన్నంటుతున్నాయి. వీటిని అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు మహమత్ ఇద్రిస్ డేబీ తన అధికారాన్ని రెండేళ్ల పాటు పొడగించుకోవడాన్ని నిరసిస్తూ వేలాది మంది ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో గురువారం దేశంలోని రెండు అతిపెద్ద నగరాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఎగిసిపడ్డాయి. చాద్ భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరపడంతో 60 మంది మరణించారు.