Namaz in train, ex-BJP MLA files complaint with Indian Railways:ఉత్తర్ ప్రదేశ్ లో మరో వివాదం మొదలైంది. ట్రైన్ లో నమాజ్ చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన నాయకులు ఈ చర్యను విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మొత్తం ఘటనను ఉత్తర్ ప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే దీప్లాన్ భారతి చిత్రీకరించారు. నలుగురు ముస్లిం వ్యక్తులు రైలులో ప్రయాణికులు నడిచే స్థలంలో నమాజ్ చేయడం ఇందులో కనిపిస్తుంది.
ట్రైన్ ఖద్దా రైల్వే స్టేషన్ లో ఆగినప్పుడు నలుగురు నమాజ్ చేస్తున్నట్లు చూపబడింది. ఈ ఘటన అక్టోబర్ 20న జరిగింది. తాను సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు నలుగురు వ్యక్తులు నమాజ్ చేయడం, ఇతర ప్రయాణికులను అడ్డుకోవడం చూశానని బీజేపీ లీడర్ దీప్లాన్ చెప్పారు. స్లీపర్ కోచ్ లో నమాజ్ చేశారని.. ఇతర ప్రయాణికులు రైలులో ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి అసౌకర్యానికి గురయ్యారని దీప్లాన్ భారతి అన్నారు. కోచ్ కు రెండు వైపుల ఇద్దరు వ్యక్తులు కోచ్ లోకి ప్రవేశించకుండా, వెళ్లకుండా అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు.
Read Also: IT Employees: మరిన్ని రోజులు ఉండం.. మళ్లీ ఇటువైపు రాం.
బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ ఎలా చేస్తారు..? అది తప్పు అని దీప్లాన్ భారతి అన్నారు. ఈ ఘటనపై సంబంధిత రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్ లో బహిరంగంగా నమాజ్ చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో లక్నోలోని లులు మాల్ లో కొంతమంది వ్యక్తులు నమాజ్ చేస్తున్న వీడియో బయటకు రావడంతో వివాదం చెలరేగింది. రాజకీయంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే గతంలో రోడ్లపై, పబ్లిక్ ప్లేసుల్లో ప్రార్థనలను చేయడాన్ని యూపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రోడ్లపై నమాజ్ చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని హెచ్చరించింది. అయితే ప్రస్తుతం ట్రైన్ లో ప్రార్థనలు చేయడం మరే రచ్చకు దారి తీస్తుందో చూడాలి.
https://twitter.com/IndiaObservers/status/1583702520475844608