Namaz In Train: ట్రైన్‌లో నమాజ్.. విచారణకు యోగి సర్కార్ ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Govt investigating Namaz in train issue: రైలులో ముస్లింలు నమాజ్ చేస్తున్న వీడియో దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. దీనిపై కొంత మంది సానుకూలంగా ఉండగా.. మరికొంత మంది ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే దీప్లాన్ భారతి షేర్ చేసిన ఈ వీడియోపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా రైలులో నమాజ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై దీప్లాన్ భారతి రైల్వేకు, యూపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్ ఖుషీనగర్ ఖద్దా రైల్వే స్టేషన్ లో ఆగిన సమయంలో నలుగురు ముస్లింలు ట్రైన్ స్లీపర్ కోచ్ లో ప్రయాణికులు నడిచే స్థలంలో నమాజ్ చేశారు. ప్రయాణికులు కోచ్ లోకి వెళ్లకుండా, కోచ్ నుంచి బయటకు రాకుండా ఇద్దరు వ్యక్తుల అడ్డుకోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. దీంతో నమాజ్ అయిపోయేదాకా ప్రయాణికులు కోచ్ లోకి వెళ్లలేకపోయారు.
Read Also: Chandrayan-3: వచ్చే ఏడాది చంద్రయాన్-3.. వెల్లడించిన ఇస్రో ఛైర్మన్
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే ఈ ఘటనపై యూపీ సర్కార్ విచారణకు ఆదేశించింది. రాష్ట్ర పోలీసులతో పాటు రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటివి ప్రజా జీవితానికి ఆటంకం కలిగిస్తుందని పలు సంస్థలతో పాటు బీజేపీ పార్టీ ఆరోపిస్తోంది. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ప్రభుత్వాలు కక్ష సాధిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో హర్యానాలో ఇలాగే ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడం వివాదాన్ని రాజేసింది. హిందూ సంస్థలు వారికి వ్యతిరేకంగా జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఇది ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది.
జూలై నెలలో ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలోని లూలూ మాల్ లో కొంతమంది ప్రార్థనలు చేయడం.. ఈ వీడియో వైరల్ కావడం జరిగింది. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేలా ఎవరు ప్రయత్నించినా.. కఠినంగా చర్యలు తీసుకుంటామని సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ముందస్తు అనుమతులు లేకుండా రాష్ట్రంలో ఎలాంటి మతపరమైన ఊరేగింపులకు, లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని ఈ ఏడాది ప్రారంభంలో సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేయడాన్ని కూడా నిషేధించారు.
Gorakhpur, Uttar Pradesh | In a viral video, a few men were seen offering namaz onboard a train in Kushinagar.
"Investigation will be done and then further action will be taken on the matter," says Awadesh Singh, SP on a viral video of namaz being offered onboard a train. pic.twitter.com/qYkBgPaHW4
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 22, 2022
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!