Uterine cancer: గర్భాశయ క్యాన్సర్లకు కారణం అవుతున్న హెయిర్ స్టైలింగ్ రసాయనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chemicals in hair straightening products linked to uterine cancer: మహిళల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ కాన్సర్లు ఒకటి. బ్రెస్ట్ క్యాన్సర్లతో పాటు గర్భాశయ క్యాన్సర్లు మహిళల్లో తరుచుగా వస్తుంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ అధ్యయనంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తుల్లోని రసాయనాలు గర్భాశయ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతున్నాయని తేలింది. అమెరికాలో 33,497 మంది మహిళలపై నిర్వహించిన ఆధ్యయనంలో ఈ విషయం తెలిసింది. మనం సౌందర్యానికి, మంచి హెయిర్ స్టైల్ కు వాడే రసాయనాలే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని తేలింది.
Read Also: Y.S. Sharmila: దళిత బందును కాస్తా అనుచరుల బందు చేశారు
Also Read
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం శాస్త్రవేత్తలు యూఎస్ఏలో 35-75 ఏళ్ల వయసు గల 33 వేల మంది మహిళల డేటాను సేకరించారు. దాదాపుగా 11 ఏళ్ల పాటు మహిళల ఆరోగ్య విషయాలను సేకరించారు. ఆ సమయంలో 378 గర్భాశయ క్యాన్సర్లు నమోదు అయ్యాయి. హెయిర్ స్ట్రెయిట్నర్లను ఎప్పుడూ ఉపయోగించని మహిళల్లో 1.64 శాతం గర్భాశయ క్యాన్సర్లు గుర్తిస్తే.. తరుచుగా వాడే వారిలో 4.05 శాతం గర్భాశయ క్యాన్సర్లు నమోదు అయ్యాయని పరిశోధకులు తెలిపారు. హెయిర్ స్ట్రెయిట్నర్లలో ఉండే పారాబెన్స్, బిస్పినాల్ ఏ వంటి రసాయనాలు క్యాన్సర్లకు దారి తీస్తాయని అధ్యయనంలో తేలింది.
హెయిర్ స్ట్రెయిట్నింగ్ ఉత్పత్తులు వాడని వారితో పోలిస్తే.. వీటిని వాడే వారిలో గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశం రెండింతలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. మహిళలు ఉపయోగించే జట్టుకు సంబంధించిన సౌందర్య సాధనాల్లో పారాబెన్లు, బిస్పినాల్ ఏ, ఇతర లోహాలు, ఫార్మాల్డిహైడ్స్ వంటిని గర్భాశయ క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయి. అయితే ఇవే పూర్తిగా క్యాన్సర్లకు దోహదం చేస్తాయో లేదో..? అనే విషయాన్ని మరిన్ని పరిశోధనలు చేసి తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..