Sikh secessionist group to defend man who shot dead Shiv Sena leader in Amritsar: పంజాబ్ రాజధాని అమృత్సర్లో శివసేన నాయకుడిని కాల్చిచంపడం ఆ రాష్ట్రంలో ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇదిలా ఉంటే సిక్కు వేర్పాటువాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ నిందితుడికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించి మరో వివాదాన్ని రాజేసింది. శివసేన నాయకుడు సుధీర్ సూరిని కాల్చి చంపిన వ్యక్తిని రక్షించేందుకు వేర్పాటువాద సంస్థ, ఖలిస్తాన్ మద్దతుదారు సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) రూ.10 లక్షల న్యాయసహాయాన్ని ప్రకటించింది. శివసేన నేత…
BJP Promises Uniform Civil Code In Himachal If Voted Back To Power: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ఆదివారం రోజున పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ మేనిఫేస్టోను విడుదల చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో మళ్లీ అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడుతామనే విషయాలను మేనిఫేస్టోలో వివరించారు. 11 హామీలను ఇచ్చారు. ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యూనిఫాం సివిల్ కోడ్…
Kerala youth beaten to death by his cousin for being late in feeding his dog: కేరళలో దారుణం జరిగింది. పెంపుడు కుక్కకు ఆహారం ఇవ్వడం ఆలస్యం అయిందని కజిన్ ను చంపేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోొ జరిగింది. ముళయంకవు పెరుబ్రతోడిలోని అబ్దుల్ సలాం, అయిషా దంపతుల కుమారుడు అర్షద్(21) అతని బంధువు హకీమ్(27)తో కలిసి పాలక్కాడ్ లోని మన్నెంగోడ్ లోని అథానిలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. అర్షద్ పెంపుడు కుక్కకు ఆహారం ఇవ్వడం…
BJP is leading in four seats in the by-elections: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా వెళ్తోంది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మునుగోడులో టీఆర్ఎస్ పార్టీతో నువ్వానేనా అన్న రీతిలో పోరాడుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
Uddhav Thackeray's shock to BJP.. Huge lead in by-elections: మహారాష్ట్రలో బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గం. అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నికల్లో శివసేన వర్గం ఎమ్మెల్యే భారీ అధిక్యం దిశగా కొనసాగుతోంది. శివసేన చీలిక వర్గం ఏక్ నాథ్ షిండేతో అధికారాన్ని ఏర్పాటు చేసి బీజేపీకి తొలి దెబ్బ తాకేలా కనిపిస్తోంది. శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే మరణంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి
15 Indian Fishermen Arrested By Sri Lankan Navy: శ్రీలంక నేవీ 15 మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసింది. తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా వచ్చినట్లు ఆరోపిస్తూ వీరిందరిని శ్రీలంక అధికారులు అరెస్ట్ చేశారు. భారతీయు అరెస్టు గురించి ఆదివారం అధికారిక ప్రకటన చేసింది శ్రీలంక. మన్నార్ ద్వీపం వాయువ్య తీరంలో ఉన్న తలైమన్నార్ లో శనివారం మత్స్యకారులను అరెస్ట్ చేసినట్లు ఆ దేశ నేవీ వెల్లడించింది. ఇటీవల తరుచుగా భారత మత్స్యకారులు శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశిస్తున్నారు.
USA Shooting Incident: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన సంభవించింది. ఫిలడెల్ఫియాలోని ఒక బార్ వెలుపల ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో 12 మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో పలువురి షూటర్ల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. నల్లటి కారులో వచ్చిన వ్యక్తి నడిరోడ్డుపై ఉన్న వ్యక్తులపై కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం.
Over 1,000 zebras, elephants and wildebeest die after Kenya drought: ఆఫ్రికాదేశం కెన్యాలో కరువు తాండవిస్తోంది. అక్కడి ప్రజలతో పాటు వన్య ప్రాణులు కరువుబారిన పడి అల్లాడుతున్నాయి. కెన్యాలో గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేని అత్యంత దారుణమైన కరువును ఎదుర్కొంటోంది. ముఖ్యంగా వన్య ప్రాణులు కరువు దెబ్బకు వేలాదిగా చనిపోతున్నాయి. ఇప్పటి వరకు 512 వైల్డ్ బీస్ట్, 381 జీబ్రాలు, 205 ఏనుగులు, 49 గ్రేవీస్ జీబ్రాలు, 51 అడవి బర్రెలు చనిపోయాయని కెన్యా ప్రభుత్వ అధ్యయనంలో తేలింది.
An earthquake hits Uttarakhand:ఉత్తరాఖండ్లో భూకంపం సంభవించింది. డెహ్రాడూన్ తో పాటు పలు నగరాల్లో భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం 8.33 గంటల ప్రాంతంలో భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
Tuition Teacher's Father Arrested For Molesting Minor Girls In Chhattisgarh: ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా.. చట్టాలు తీసుకువస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. వావీ వరస, చిన్నా పెద్ద భేదం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రతీరోజు దేశంలో ఎక్కడో చోట అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే సభ్యసమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించాడు ఓ వృద్ధుడు. తన మనవరాళ్ల వయసుండే బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది.