Mahindra Partners With Three EV Infrastructure Firms to Build Charging Stations for Upcoming Vehicles: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పలు కంపెనీలు ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ కార్లులు, బైకుల ఉత్పత్తిని మరింగా పెంచుతున్నాయి. ఇప్పటికే టాటా, ఎంజీ, మహీంద్రా, కియా, హ్యుందాయ్, బీవైడీ వంటి కంపెనీలు ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేశాయి. రానున్న కాలంలో మరిన్ని మోడళ్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే చాలా మంది వినియోగదారులు ఈవీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నప్పటికీ.. ఛార్జింగ్ సదుపాయాలు ఇండియా వ్యాప్తంగా విస్తరించపోవడంతో వెనుకడుగు వేస్తున్నారు.
ఇదిలా ఉంటే రాబోయే కాలంలో తన ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాల కోసం దేశీయ ఆటోమేకర్ మహీంద్రా మూడు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. జియో-బీపి, స్టాటిక్, ఛార్జ్+జోన్ అనే మూడు ఎలక్ట్రిక్ వెహికిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భాగస్వాములతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బుధవారం తెలిపింది. మహీంద్రా ఈవీ వినియోగదారుల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలను విస్తరించేందుకు ఒప్పందాలు చేసుకుంది.
Read Also: Revanth Reddy: బీజేపీ, టీఆర్ఎస్.. విక్రమార్కుడులో రవితేజ, బ్రహ్మానందం లెక్క
ఇటీవల తన మహీంద్ర తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ 400ను తీసుకువచ్చింది. రానున్న కాలంలో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను కూడా భారతదేశంలో ప్రవేశపెట్టాలని సంస్థ భావిస్తోంది. గత నెలలో జియో బీపీ, రాబోయే మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పలు ఆటోమొబైల్ దిగ్గజాలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తిని వేగం చేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల విషయంలో టాటా టాప్ ప్లేసులో ఉంది. టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ, టియాగో ఈవీలు మార్కెట్ లో ఉన్నాయి. మహీంద్రా తన ఎక్స్‌యూవీ 400ని లాంచ్ చేసింది. ఇక ఎంజీ జెడ్ఎస్ ఈవీని అమ్ముతోంది. హ్యుందాయ్ నుంచి కోనా ఎలక్ట్రిక్ కార్ ప్రస్తుతం మార్కెట్ లో ఉంది.