physical assault on 10th class girl in tamil nadu: దేశంలో ప్రతీరోజు ఎక్కడో చోట అత్యాచారం, లైంగిక వేధింపుల సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వావీవరస, చిన్నాపెద్ద తేడా లేకుండా మృగాళ్లు బరితెగిస్తున్నారు. తాజాగా తమిళనాడులో 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి.. దాన్ని వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే తమిళనాడు విలుప్పురం జిల్లాలో 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై 26 ఏళ్ల జ్ఞానశేఖర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలికను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి.. తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. ఈ ఘటనను వీడియో తీసి బాలికను బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. బాలిక ఫిర్యాదు నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
Read Also: New rule for TV channels: టీవీ ఛానెళ్లకు కొత్త రూల్.. ఇకపై ప్రతీరోజూ 30 నిమిషాలు ఇవి తప్పనిసరి..
యూపీలో కిడ్నాప్, బీహార్ లభ్యం.. నాలుగు నెలలు నరకం:
నాలుగు నెలల క్రితం ఉత్తర్ ప్రదేశ్ లో కిడ్నాప్ కు గురైన 13 ఏళ్ల బాలికను బీహార్ లోని భాగల్ పూర్ లో రెస్క్యూ చేశారు పోలీసులు. కిడ్నాప్ చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. బాలిక వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకున్న పోలీసులు, తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు అమిత్ రాయ్(19) బాలికను కిడ్నాప్ చేసినట్లు ఎస్పీ దుర్గాప్రసాద్ తివారీ బుధవారం తెలిపారు. జూలై 28న బాలిక కిడ్నాప్ అయిందని కేసు నమోదు అయింది.
బాలికను కిడ్నాప్ చేసిన అమిత్ రాయ్, అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు. ఆదివారం బాలికను రక్షించినట్లు పోలీసులు వెల్లడించారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని జ్యుడిషీయల్ కస్టడికి పంపినట్లు ఎస్పీ తివారీ వెల్లడించారు.