Drunken Elephants: ఒడిశాలో విచిత్ర సంఘటన జరిగింది. ఏనుగుల గుంపు మద్యం తాగి గంటల తరబడి మత్తులో ఉన్నాయి. ఈ ఘటన ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం చుట్టు పక్కల ఉండే గ్రామస్తులు అటవీ ప్రాంతంలో తరుచుగా మద్యం తయారు చేస్తుంటారు. అటవీ ప్రాంతంలో దొరికే ఇప్పపూలు, ఇతర సామాగ్రితో సారా కాస్తుంటారు. ఇదిలా ఉంటే గ్రామస్తులు దాచిన ఇప్పసారాను తాగాయి 24 ఏనుగులు దీంతో అవన్నీ కొన్ని గంటల పాటు మత్తులో ఉండి నిద్రిస్తున్నాయి.
Read Also: Akunuri Murali: తెలంగాణలో మరో కొత్త పార్టీ.. సిద్ధమైన రిటైర్డ్ ఐఏఎస్..
ఈ ఘటన పటానా అటవీ రేంజ్ లోని శిలిపాడ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రజలు ఇప్పసారా ఉన్న ప్రాంతానికి వెళ్లే సరికి కుండలు పగిలిపోవడంతో పాటు ఇప్ప సారా కూడా కనిపించకుండా పోయింది. దీంతో గ్రామస్తులు వెతకగా 24 ఏనుగులు ఇప్పసారాను తాగి పడిపోయి ఉండటాన్ని గమనించారు. గురువారం ఉదయం 6 గంటలకు మేము ఇప్ప సారా కాచే ప్రాంతానికి వెళ్ళామని అయితే కుండలన్నీ పగిలిపోయి ఉండటంతో పాటు పులియబెట్టిన సారా కనిపించలేదని నారియా సేథి అనే గ్రామస్తుడు వెల్లడించారు. మేము ఏనుగులను లేపేందుకు ప్రయత్నించామని కానీ నిద్ర నుంచి లేపలేకపోయామని గ్రామస్తులు చెబుతున్నారు.
దీంతో గ్రామస్తులు అటవీ శాకు సమాచారం అందించారు. పటానా అటవీ రేంజ్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని, ఏనుగులను లేపేందుకు పెద్ద ఎత్తున డప్పుులు వాయిస్తూ శబ్ధాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొంత సేపటికి ఏనుగులు మేలుకుని అడవిలోకి వెళ్లాయని అటవీ అధికారి ఘాసిరామ్ పాత్ర వెల్లడించారు. అయితే ఏనుగులు పులియపెట్టిన సారాను తాగాయా..? లేదా..? అని ఖచ్చితంగా తెలియదని వెల్లడించారు.