Gujarat Set To Vote For 788 Candidates On 89 Seats For 1st Phase: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. నేడు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం ఎన్నికలకమిషన్ అన్ని ఏర్పాట్లను చేసింది. రాష్ట్రంలో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు తొలివిడతలో పోలింగ్ జరగనుంది. అన్ని రాజకీయ పార్టీ నుంచి మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.…
Prime Minister Narendra Modi reacts to Mallikarjuna Kharge's 'Ravan' comments: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ‘ రావణ్’ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. గురువారం గుజరాత్లోని కలోల్లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. రావణ్ వ్యాఖ్యలను గురించి ప్రస్తావించారు. మోదీని ఎక్కువగా దూషించాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాముడిని ఎప్పుడూ నమ్మ లేదని మోదీ అన్నారు. డిసెంబర్ 5వ విడత ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్…
RBI to launch Digital Rupee pilot in 4 cities today: క్యాష్ లెస్ ఎకానమీ కోసం దేశం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. దీన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఆర్బీఐ నేడు డిజిటల్ రూపాయిని ప్రారంభించనుంది. 2016 నుంచి భారతదేశం అంతటా డిజిటల్ లావాదేవీలను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే నేటి నుంచి ప్రయోగాత్మకంగా ఇండియాలో నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయిని ప్రారంభించనుంది.
గుజరాత్ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. తొలి విడతలో మొత్తం 19 జిల్లాల్లోని 89 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లోని జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్యలో త్రిముఖపోరు నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి.
Zelensky Slams Elon Musk's Russia Peace Plan: ఉక్రెయిన్ దాడిని ఆపాలంటూ రష్యాకు సూచిస్తూ కొన్ని ప్రతిపాదనలు చేశారు అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్. అయితే మస్క్ చేసిన ప్రతిపాదనలపై మండి పడ్డారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ. బుధవారం న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో జెలన్ స్కీ మాట్లాడుతూ.. ఎలాన్ మస్క్ ప్రతిపాదనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు యుద్ధ పరిస్థితి తెలియాలంటే ఉక్రెయిన్ వచ్చి చూడాలని సూచించారు. రష్యా, ఉక్రెయిన్ లో ఏం చేసిందనేది అప్పుడు అర్థం అవుతుందని…
Swara Bhasker joins Bharat Jodo, walks with Rahul Gandhi in Ujjain: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రం ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో జరుగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ పాదయాత్రతో కన్యాకుమారిలో ప్రారంభం అయింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రల్లో ముగిసిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ చేరింది. ఇదిలా ఉంటే గురువారం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో చేరారు బాలీవుడ్ నటి స్వరా…
Iranian Killed For Celebrating FIFA World Cup Loss to United States: ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ జరుగుతోంది. ఇటీవల అమెరికా చేతిలో ఇరాన్ ఓడిపోవడంతో అక్కడి ప్రజలు దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సాధారణంగా తమ దేశం గెలిస్తే సంబరాలు చేసుకునే ప్రజలు, ఓడిపోయినందుకు సంబరాలు చేసుకున్నారు. మహ్సఅమిని పోలీస్ కస్టడీలో చనిపోవడంతో ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సమయంలో ఇరాన్ జట్టు ఫిఫాలో మ్యాచులు…
Haris Rauf BREAKS Silence On Virat Kohli’s Iconic Sixes At MCG During T20 World Cup: ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ అన్ని మ్యాచులు ఒకెత్తు అయితే.. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ మరో ఎత్తు. టోర్నీకే ఈ మ్యాచ్ వన్నె తీసుకువచ్చింది. విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్ భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచుకు 90 వేలకు పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఓటమి…
US Looks Forward To Continue Working With Pakistan: అమెరికా ఎప్పుడూ తన ప్రయోజనాలనే ముందు చూసుకుంటుంది. ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్నామనే కలరింగ్ ఇస్తూనే.. తన లాభాన్ని చూసుకుంటుంది. ఇది మరోసారి రుజువైంది. భారతదేశం తమకు అత్యంత సన్నిహిత దేశం అని చెబుతూనే దాయాది దేశం పాకిస్తాన్ కు సహరిస్తుంది. ఆర్థికంగా, సైనికంగా ఇటీవల కాలంలో పాకిస్తాన్- అమెరికాల మధ్య మళ్లీ బంధం బలపడుతోంది.
Rajasthan Man Kills Wife To Get ₹ 1.90 Crore Insurance Amount: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. తన భార్యనే హత్య చేసి బీమా డబ్బులు పొందాలని పథకం వేశాడు. అయితే మరణంపై అనుమానం రావడంతో ఈ కుట్ర బయటపడింది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య పేరుపై ఇన్సూరెన్స్ చేయించాడు. ఆమె ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1.9 కోట్లు వస్తాయనే ఆశతో ఆమెను కిరాయి వ్యక్తితో హత్య చేయించాడు. ఆమె ప్రయాణిస్తున్న…