గుజరాత్ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. తొలి విడతలో మొత్తం 19 జిల్లాల్లోని 89 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లోని జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్యలో త్రిముఖపోరు నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి.
గతంలో 2017 ఎన్నికల్లో ఈ 89 స్థానాల్లో బీజేపీ 48, కాంగ్రెస్ 40, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. గుజరాత్‌లో మొత్తం 4,91,35,400 మంది ఓటర్లలో మొదటి దశ ఎన్నికల్లో 2,39,76,670 మంది ఓటు వేయనున్నారు. మొత్తం 14,382 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుందని, అందులో 3,311 పట్టణాల్లో, 11,071 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. రెండో విడత ఎన్నికలు డిసెంబర్ 5న జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు విడుదల కానున్నాయి.
గుజరాత్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. తొలి విడతలో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
#Gujarat records 56.88% voter turnout till 5 pm in the first phase of the ongoing Assembly elections
— ANI (@ANI) December 1, 2022
గుజరాత్ తొలి విడత ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 48.48 శాతం ఓటింగ్ నమోదైంది.
Gujarat records 48.48% voter turnout till 3 pm in the first phase of the ongoing Assembly elections; 63.98% voting in Tapi
(Data source: Election Commission of India) pic.twitter.com/KPAIh6iHe8
— ANI (@ANI) December 1, 2022
గుజరాత్ తొలి విడత ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 34.48 శాతం ఓటింగ్ నమోదు అయింది.
34.48% voter turnout recorded till 1 pm in the first phase of #GujaratElections2022 pic.twitter.com/3seidm1L07
— ANI (@ANI) December 1, 2022
1995 నుంచి గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ వరసగా అధికారంలో ఉంది. అయితే మొత్తం 182 స్థానాలు ఉన్న రాష్ట్రంలో 2017 ఎన్నికల్లో బీజేపీ బలం 137 స్థానాల నుంచి 99కి పడిపోయింది. అయితే ఈసారి 140 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరుగా గుజరాత్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు.
గుజరాత్ మొదటి విడత ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 18.95 శాతం ఓటింగ్ నమోదు అయింది.
18.95% voter turnout recorded till 11 am in the first phase of #GujaratElections2022 pic.twitter.com/0yVvtuIopk
— ANI (@ANI) December 1, 2022
స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా జామ్‌నగర్‌లో ఓటేశారు. అంతకుముందు ఆయన సతీమణి రివాబా జడేజా రాజ్‌కోట్‌లో ఓటు వేశారు. రవీంద్ర జడేజా మాట్లాడుతూ.. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
గుజరాత్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్టార్ క్రికెటర్ రవీంద్ జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ జడేజా, సోదరి నైనా జడేజా జామ్ నగర్ లో ఓటేశారు. రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవి, కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా, దివంగత కాంగ్రెస్ లీడర్ అహ్మద్ పటేల్ కుమర్తే ముంతాజ్ పటేల్, గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ నిమా బెన్ ఆచార్య ఓటేశారు.
ఆఫ్రికన్ మూలాలు ఉన్నవారి కోసం గుజరాత్ ఎన్నికల్లో ప్రత్యేక బూత్ ఏర్పాటు చేశారు. జంబూర్ లో తొలిసారిగా ఈ ప్రత్యేక గిరిజన బూత్ ఏర్పాటు చేశారు. జునాగఢ్ కోట నిర్మిస్తున్న సమయంలో ఆఫ్రికా నుంచి గుజరాత్ కు వచ్చారు వీరంతా. కాలక్రమేణా గుజరాత్ సంప్రదాయంలో భాగమయ్యారు.
గుజరాత్ తొలి విడుత ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 4.92 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఈసీ వెల్లడించింది.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆయన సతీమణి అంజలీ రూపానీ రాజ్‌కోట్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రివాబా రాజ్‌కోట్‌లో ఓటు వేశారు. బీజేపీ నుంచి జామ్‌నగర్ నార్త్ నుంచి రివాబా జడేజా పోటీలో ఉన్నారు.
గుజరాత్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. కచ్-సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
గుజరాత్ నేడు ప్రజాస్వామ్య పండుగ జరుపుకుంటుందని అన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఈ రోజు, డిసెంబర్ 5న జరిగే గుజరాత్ ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం తరుపున విజ్ఞప్తి చేశారు. గుజరాత్ ఎన్నికల్లో ఈ సారి 4.9 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Gujarat is celebrating festival of democracy today. On behalf of EC, my sincere appeal to all 4.9 cr voters of Guj to vote today & on 5th Dec during 2nd phase of elections. Over 4 lakh PwD voters & 9.8 lakh senior citizen voters in Gujarat: CEC Rajiv Kumar #GujaratElections pic.twitter.com/NIEznRgvOT
— ANI (@ANI) December 1, 2022
గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. తొలి విడతలో 89 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. గత రెండు దశాబ్ధాలుగా బీజేపీకి గుజరాత్ కంచుకోటగా ఉంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో, కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుపొందింది. ఈ సారి మాత్రం రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ బరిలో ఉంది. పంజాబ్ రాష్ట్రంలో గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఆప్ గుజరాత్ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోంది.