Omicron subvariant BF.7 detected in India : చైనాలో కోవిడ్ -19 విజృంభనకు కారణం అవుతున్న ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ దేశంలోకి ప్రవేశించింది. తాజాగా భారత్ లో మూడు బీఫ్.7 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒక బీఎఫ్.7 వేరియంట్ కేసులను బుధవారం వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో మొదటి బీఎఫ్.7 కేసును అక్టోబర్ లో గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ గుర్తించింది. చైనాలో తీవ్రమైన కోవిడ్ కేసులకు ఈ ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ కారణం అవుతోంది.
Read Also: Amruta Fadnavis: నరేంద్ర మోదీ “భారత జాతిపిత”.. డిప్యూటీ సీఎం భార్య సంచలన వ్యాఖ్యలు
ఈ బీఎఫ్.7 వేరియంట్ అత్యధిక వేగంతో ఇన్ఫెక్షన్ కు కారణం అవుతోంది. ఒమిక్రాన్ బీఏ.5 సబ్ వేరియంటే ఈ బీఎఫ్.7. తక్కువ ఇక్యుబేషన్ పిరియడ్ ఉండటంతో పాటు టీకాలు వేసుకున్నవారికి కూడా ఇన్ఫెక్షన్ కలిగించడం ఈ బీఎఫ్.7 ప్రత్యేక లక్షణం. ఇప్పటికే యూకే, యూఎస్ఏ, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి యూరోపియన్ దేశాలతో సహా పలు ఇతర దేశాల్లో కూడా ఈ బీఎఫ్ 7 వేరియంట్ ను కనుక్కున్నారు.
2019లో చైనా వూహాన్ నగరంలో ప్రారంభం అయిన ఈ కరోనా మహమ్మారి మూడేళ్లుగా ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. పలుసార్లు తన రూపాన్ని మార్చుకుని ప్రజలపై దాడులు చేస్తోంది. ఇప్పటికే ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ ఇలా రూపాంతారాలు చెందింది. ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ4, బీఎఫ్.7 పుట్టుకొస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన అత్యున్నత సమావేశం జరిగింది. రద్దీ ప్రాంతాల్లో తప్పకుండా మాస్కులు ధరించాలని కేంద్ర ప్రజలకు సూచించింది. దీంతో పాటు ఎయిర్ పోర్టుల్లో హై అలెర్ట్ ప్రకటించింది. ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులను ఏర్పాటు చేయనుంది.