Passenger finds cockroach in omlette served on Rajdhani Express: రైల్వేను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే కొన్నిసార్లు సిబ్బంది అలసత్వం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా రాజధాని ఎక్స్‌ప్రెస్ ఓ ప్రయాణికులు ఆర్డర్ చేసిన ఆహారంలో బొద్ధింక దర్శనం ఇచ్చింది. ఈ పరిణామంతో కంగుతిన్న ప్రయాణికుడు భోజనాన్ని ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇండియన్ రైల్వేస్, కన్జూమర్ ఎఫైర్, ఫుడ్, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను ట్యాగ్ చేశారు.
Read Also: End Of The Earth: భూమి ఇలాగే అంతం అవబోతోందా..? చనిపోతున్న ఈ గ్రహమే ఉదాహరణ
ఢిల్లీ-ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో తన రెండేళ్ల కుమార్తె కోసం ఆమ్లెట్ ఆర్ఢర్ చేశానని.. భోజనం రాగానే ఆమ్లెట్ లో బొద్దింక కనిపించిందని ప్రయాణికుడు ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ నెల 16 ఢిల్లీ నుంచి ముంబైకి ప్రయాణిస్తున్న సమయంలో ఇది జరిగిందని.. నా కుమార్తె కోసం ఆమ్లెట్ ఆర్ఢర్ చేశానని.. ఒకవేళ రెండున్నరేళ్ల తన కుమార్తెకు ఏదైనా జరిగితే ఆ బాధ్యులెవరని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. బొద్ధింక ఉన్న ఆహారాన్ని పోస్ట్ చేశారు.
ఈ ఫిర్యాదుపై రైల్వే కూడా స్పందించింది. రైల్వే ప్రయాణికలు కోసం ఆన్ లైన్ సపోర్ట్ సర్వీస్, రైల్వే సేవ స్పందిస్తూ.. అసౌకర్యానికి చింతిస్తున్నామని.. దయచేసి పీఎన్ఆర్, మొబైల్ నెంబర్ డైరెక్ట్ మెసేస్ లో షేర్ చేయాలని పేర్కొంది. ఈ ఘటన తర్వాత రైల్వే చర్యలు తీసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సంబంధిత వంటగాడిని తొలగించింది. సంబంధిత సేవలు అందిస్తున్న కాంట్రాక్టర్ కు రూ.1 లక్ష జరిమానా విధించింది. ప్యాంట్రీ సిబ్బంది మరింత శ్రద్ధ తీసుకోవాలని హెచ్చరించింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కీటకాలు రాకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించింది.
https://twitter.com/the_yogeshmore/status/1603969434187857920