Ali Ahmed Aslam, ‘Chicken Tikka Masala’ Inventor, Dies At 77: చికెన్ టిక్కా మసాలా ప్రత్యేకం పరిచయం అక్కర లేని వంటకం. చాలా మందికి ఇష్టం. దేశంతో పాటు ప్రపంచంలో అన్ని రెస్టారెంట్ మెనూల్లో ఈ వంటకం తప్పకుండా ఉంటుంది. అయితే ఈ వంటాకాన్ని మొదటిసారిగా సృష్టించిన వ్యక్తి ఫేమస్ చెఫ్ అహ్మద్ అస్లాం అలీ కన్నుమూశారు. ఈ ఐకానిక్ డిష్ ని 1970లో కనుక్కున్నారు. 77 ఏళ్ల వయసులో యూకేలోని గ్లాస్గోలో ఆయన బుధవారం మరణించారు.
Read Also: Covid-19: చైనా నుంచి వచ్చే విమానాల నిలుపుదల.. కేంద్రం స్పందన ఇదే..
పాకిస్తాన్ లో జన్మించిన అస్లాం అలీ చిన్న వయసులోనే కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్ లోని గ్లాస్గోకు వెళ్లాడు. 1964లో గ్లాస్గో వెస్ట్ ప్రాంతంలో ‘శిశ్ మహల్’ పేరుతో రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ హోటల్ లోనే తొలిసారిగా ఆయన చికెన్ టిక్కా మసాల వంటకాన్ని సృష్టించారు. ఆయన మృతికి సంతాపంగా ఈ రెస్టారెంట్ ను 48 గంటల పాటు మూసివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్లాస్గో సెంట్రల్ మసీదులో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
గతంతో ఈ వంటకానికి బీజం పడిన సంఘటనను అస్లామ్ ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు. 1970లో చికెన్ టిక్కాను డ్రైగా కాకుండా వెట్ గా చేసే తయారు చేసే మార్గం ఉందా..? అని ఓ కస్టమర్ అడిగిన ప్రశ్న నుంచే ఈ చికెన్ టిక్కా మసాలా వంటకం పుట్టిందని వెల్లడించారు. పెరుగు, క్రీమ్ మరియు మసాలాలతో కూడిన సాస్‌తో చికెన్ టిక్కాను జోడించడంతో చికెన్ టిక్కా మసాలా వంటకం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ చికెన్ టిక్కా మసాలా యూకేలోని అన్ని రెస్టారెంట్లలో చాలా ప్రాముఖ్యత, డిమాండ్ కలిగిన వంటకంగా ఉంది. ఈ వంటకం బ్రిటన్ జాతీయ వంటకంగా కూడా చెప్పబడుతోంది. అహ్మద్ అస్లాం అలీకి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు.