Russia-Ukraine War: పది నెలలు గడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ అమెరికా పర్యటనకు వెళ్లి ఆయుధాలు, ఆర్థిక సాయం గురించి చర్చించారు. దీంతో ఇప్పట్లో ఉక్రెయిన్ కు యుద్ధం ఆపాలనే ఉద్దేశం లేనట్లుగా తెలుస్తోంది. ఇక రష్యా చర్చలకు సిద్ధం అని ప్రకటిస్తున్నా.. పుతిన్ గద్దె దిగితేనే చర్చలంటూ ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్ ను ముందుపెట్టి అమెరికా, వెస్ట్రన్ దేశాలు తమపై పరోక్ష యుద్ధం చేస్తున్నాయని రష్యా ఆరోపిస్తోంది.
31 Dead After Winter Storm In US: అమెరికాను మంచు తుఫాను అల్లాడిస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. ముఖ్యంగా దేశంలోని తూర్పు ప్రాంతాలు మంచు తుఫాను ధాటికి ప్రభావితం అవుతున్నాయి. ఇప్పటి వరకు మంచు తుఫాన్ వల్ల 31 మంది మరణించారు. న్యూయార్క్ లోని బఫెలో ప్రాంతంలో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. మంచు తుఫాన్ కారణంగా న్యూయార్క్ నగరం అతలాకుతలం అవుతోంది. అత్యవసర సేవలపై హిమపాతం తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
Rahul Gandhi's Speeches During Yatra Creating Tremors In India says MK stalin: భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఆయన చేస్తున్న ప్రసంగాలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని అన్నారు. లౌకికవాదం, సమానత్వం వంటి విలువలను కాపాడేందుకు దేశానికి నెహ్రూ, గాంధీల వంటి నాయకులు అసవరం అని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేత ఏ గోపన్న రాసిన ‘మమనితార్ నెహ్రూ’ పుస్తకాన్ని చెన్నైలో విడుదల చేసిన ఆయన నెహ్రూపై ప్రశంసలు…
Multiple blasts in Pakistan's Balochistan kill five:పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఆదివారం బలూచిస్థాన్ ప్రావిన్సులో పలు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు పాకిస్తాన్ సైనికులు మరణించారు. 12 మంది పౌరులు గాయపడ్డారు. డిసెంబర్ 24 నుంచి పాక్ ఆర్మీ, ఇతర భద్రతా బలగాలు బలూచిస్తాన్ వ్యాప్తంగా ఇంటలిజెన్స్ సమాచారంతో ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
India approves 120 Pralay missiles for armed forces along China border: సరిహద్దుల్లో ఉద్రికత్త నేపథ్యంలో భారత్ హై అలర్ట్ అవుతుంది. ముఖ్యంగా చైనా సరిహద్దులను మరింత సురక్షితంగా మార్చేందుకు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది భారత మిలటరీ. తాజాగా భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి సాయుధ దళాల కోసం 120 ప్రళయ్ క్షిపణులను ఏర్పాటు చేయబోతోంది.
China and Pakistan are planning to attack India together, Says Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు ఇప్పుడు పాకిస్తాన్, చైనా ఇద్దరు శత్రువులు ఉన్నారని ఆయన అన్నారు. భారత్ పై దాడికి ప్లాన్ చేస్తున్నాయని ఆయన అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మాజీ సైనికులతో సంభాషిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదైనా దాడి జరిగితే..ఇరు వర్గాలు నష్టపోతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత దేశం ప్రమాదంలో ఉందని ఆయన పేర్కొన్నారు.…
Vladimir Putin Says West Wants To "Tear Apart" Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి 10 నెలలు పూర్తయ్యాయి. అయినా ఇప్పడప్పుడే యుద్ధం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. వెస్ట్రన్ దేశాలు రష్యాను విచ్ఛిన్నం చేయడాని ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని సమర్థించారు పుతిన్. ఇది రష్యన్లను ఏకం చేయడానికే అని అన్నారు. ఉక్రెయిన్లు కూడా రష్యన్లే అని ఆయన అన్నారు.
Pushpa Dahal 'Prachanda' Appointed Nepal's Prime Minister For Third Time: నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ దహల్(ప్రచండ) నియమితులయ్యారు. మూడో సారి ప్రధాని పీఠాన్ని చేజిక్కించుకున్నారు ప్రచండ. నేపాలీ కాంగ్రెస్ పార్టీలో సంకీర్ణంలో ఉన్న ప్రచండ, తన పార్టీ అయిన సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రస్తుతం ప్రధానిగా ఉన్న షేర్ బహదూర్ దేవుబా తన పదవని కోల్పోనున్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్ధాం అని అనుకున్న నేపాలీ కాంగ్రెస్-మావోయిస్టు సెంటర్ మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో మాజీ ప్రధాని…
Man electrocutes wife to death, buries body in room: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకున్న మహిళను భర్తే దారుణంగా హత్య చేశాడు. లఖీంపూర్ లోని గోలా గోకరన్ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తి తన భార్యను విద్యుత్ షాక్ కు గురిచేసి చంపేశాడు. చిన్న గొడవ చిలికిచిలికి భార్య మరణానికి దారి తీసింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే..ఈ నేరాన్ని దాచేందుకు ప్రయత్నించినా నిందితుడి కన్నతల్లే పోలీసులకు హత్య గురించి తెలిపింది.
Political crisis in Nepal.. Prachanda came out of the coalition: హిమాలయదేశం నేపాల్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. నేపాలీ పార్టమెంట్ లో సంఖ్యాపరంగా మూడో అతిపెద్ద పార్టీ అయిన మావోయిస్ట్ సెంటర్ చైర్మన్ పుప్ప కమల్ దహల్ (ప్రచండ) సంకీర్ణ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకున్నాడు. ప్రధాని షేర్ బహదూర్ దేవుబాకు సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాడు. దీంతో సంక్షీర్ణం డోలాయమానంలో పడింది. సంకీర్ణం ముగిసినట్లు నేపాలీ కాంగ్రెస్ పార్టీ ధృవీకరించారు. సంకీర్ణ సమావేశం నుంచి వాకౌట్ చేసిన…