Mother-in-law dies of shock after man divorces wife: వరకట్న వేధింపులు ఒకరి ప్రాణాలన్ని బలితీశాయి. భార్యకు విడాకులు ఇవ్వడంతో ఈ వార్త విని యువతి తల్లి మరణించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. వివరాల్లోకి వెళితే లక్నోలో ఓ వ్యక్తి స్పోర్ట్స్ బైక్ కొనేందుకుందు కట్నం డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ట్రిపుల్ తలాక్ ఇచ్చి తన భార్యకు విడాకులు ఇచ్చాడు. దీంతో షాక్ కు గురైన యువతి తల్లి మరణించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు…
Afghan professor tears diploma certificates in protest against women university ban: తాలిబాన్ ఏలుబడిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో మహిళ హక్కులు ప్రశ్నార్థకంగా మారాయి. తాలిబాన్ పాలకులు మహిళ విద్యపై ఉక్కుపాదం మోపారు. యూనివర్సిటీల్లోకి మహిళను నిషేధించారు. విద్యార్థినులు ఎంతగా ఆందోళన నిర్వహించినా.. తాలిబాన్లు పట్టించుకోవడం లేదు. చదువుకోకపోవడం కంటే తమ తలలు నరికేయడమే బెటర్ అని అక్కడి యువతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కులకు కూడా వీధుల్లో తిరిగే స్వేచ్ఛ ఉందని కానీ మహిళలకు అలాంటి స్వేచ్ఛ లేదని అంటున్నారు.…
Mallikarjuna Kharge's comments on Bharat Jodo Yatra: భారతదేశ ఆలోచనలు సవాల్ చేయబడుతున్నాయని.. ద్వేషానికి వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ ఏకం కావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఢిల్లీలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యలయంలో పార్టీ జెండాను ఎగరేశారు. అందర్నీ కలుపుకుని వెళ్లే కాంగ్రెస్ విధానం వల్లే భారతదేశం పురోగమిస్తోందని అన్నారు. భారతదేశమ బలమైన ప్రజాస్వామ్య దేశంగా అవరతించడమే కాకుండా కొన్ని దశాబ్ధాల్లో ఆర్థిక, అణు, వ్యూహాత్మక…
Russia-Ukraine War: ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణం అని రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. ఉక్రెయన్-రష్యా యుద్ధంలో అమెరికా లబ్ధి పొందేందుకు చూస్తోందని ఆరోపించారు. అమెరికా ఆర్థిక, సైనిక-వ్యూహాత్మక పరంగా దీన్ని నుంచి ప్రయోజనాలు పొందాలని చూస్తోంది తెలిపారు. అమెరికా, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని నియంత్రిస్తుందన్నారు. రష్యా యుద్ధభూమిలో ఉందని.. విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Rahul Gandhi not Ram, but BJP on Ravan's path says Salman Khurshid: రాహుల్ గాంధీని శ్రీ రాముడితో పోల్చి వివాదం రేపారు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్. దీనిపై విమర్శలు రావడంత తన ఉద్దేశాన్ని బుధవారం మరోసారి తెలిపారు. రాహుల్ గాంధీ రాముడు కాదని.. కానీ రాముడు చూపిన మార్గంలో నడుస్తున్నారని.. బీజేపీ మాత్రం రావణుడి బాటలో నడుస్తోందని విమర్శించారు.
Flour rate in Pakistan: సంక్షోభం దిశగా వెళ్తోంది పాకిస్తాన్. దివాళా అంచుకు చేరుకుంటోంది. ఇప్పటికే ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఉద్యోగుల జీతాల్లో కూడా కోత పెట్టింది. అనవసర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే అక్కడ నానాటికి నిత్యావసరాల ధరలు నానాటికి పెరుగుతున్నాయి. ఎంతలా అంటే రాబోయే రోజుల్లో తిండి కోసం ప్రజలు మధ్య గొడవలు తలెత్తే విధంగా పరిస్థితులు ఉన్నాయి. మరో శ్రీలంకను తలపించేలా.. అన్నింటి రేట్లు పెరుగుతున్నాయి. కనీసం ప్రభుత్వం నడపటానికి కూడా డబ్బులు లేని…
3 Terrorists Killed In Gunfight With Security Forces In Jammu: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. నిన్న జమ్మూ సమీపంలోని ఉధంపూర్ లో 15 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేసిన ఘటన మరవక ముందే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బుధవారం ఉదయం జమ్మూాలోని సిధ్రా ప్రాంతంలో ఉగ్రవాదులుకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతా బలగాలు.
Two earthquakes of 4.7 and 5.3 magnitudes strike Nepal: హిమాలయ దేశం నేపాల్ ను వరసగా భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా బుధవారం నేపాల్ లో రెండు భూకంపాలు సంభవించాయి. నేషనల్ ఎర్త్ క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున నేపాల్ లోని బగ్లుంగ్ జిల్లాలో 4.7, 5.3 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. జిల్లాలోని అధికారి చౌర్ ప్రాంతంలో తెల్లవారుజామున 1.23 గంటలకు 4.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ తరువాత ఖుంగా ప్రాంతంలో 2.07 గంటలకు రిక్టర్…
Air India Express Issues Covid Guidelines For Travellers From UAE To India: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ భయాలు నెలకొన్నాయి. చైనాలో భారీగా కేసులు, మరణాలు నమోదు అవుతుండటంతో పలు ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే భారత్ ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. టెస్టింగ్- ట్రేసింగ్- ట్రీట్మెంట్ ఫార్ములాతో ముందుకెళ్లాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు.
Putin signs decree banning oil exports to EU countries: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఈ యుద్ధ నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు అనేక ఆంక్షలు విధించాయి. దీనికి ప్రతిగా రష్యా కూడా అదే స్థాయిలో స్పందిస్తోంది. ఇటీవల యూరోపియన్ యూనియన్ దేశాలు, ఆస్ట్రేలియాలు రష్యా ముడిచమురుపై ప్రైస్ క్యాప్ విధించాయి. ఈ నిర్ణయాన్ని రష్యా తీవ్రంగా తప్పుపట్టింది. పశ్చిమ దేశాల మూర్ఖపు చర్యగా దీన్ని రష్యా ఘాటలుగా స్పందించింది.