People Fall Sick After Eating Leftover Food At Funeral In Chhattisgarh: అంత్యక్రియల తర్వాత మిగిలిన ఆహారం తిన్న 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. 40 మంది అస్వస్థతలకు గురైనట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. ఫుడ్ పాయిజనింగ్ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. బాధితులంతా ఆదివారం ఉదయం రామానుజ్‌నగర్ డెవలప్మెంట్ బ్లాక్ పరిధిలోని విషున్‌పూర్ గ్రామంలో ఆహారం తీసుకున్నారని వైద్యాధికారి డాక్టర్ ఆర్ఎస్ సింగ్ తెలిపారు. బాధితులను సూరజ్…
4 Foreigners Test Covid Positive At Bihar's Gaya Airport, Isolated: చైనాలో కోవిడ్ కొత్తవేరియంట్ బీఎఫ్-7 విజృంభిస్తోంది. ఇప్పటికే అక్కడ రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. జీరో కోవిడ్ పాలసీ ఎత్తేసిన తర్వాత అక్కడ కోవిడ్ దారుణంగా వ్యాపిస్తోంది. బీజింగ్, షాంఘై పాటు ఇతర నగరాల్లో కూడా కోవిడ్ కేసులుతో ఆస్పత్రులు నిండిపోయాయి. అక్కడ రానున్న రోజుల్లో మూడు కోవిడ్ వేవ్ లు వస్తాయని పరిశోధకులు అంచానా వేస్తున్నారు. గడిచిన 20 రోజుల్లోనే 25 కోట్ల కేసులు నమోదు అయ్యాయి.…
World Economy Is Headed For A Recession In 2023: ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు వెళ్తోందని ఇప్పటికే అనేక ఆర్థిక సంస్థలు వెల్లడించాయి. తాజాగా సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ 2023లో ఆర్థిక మాంద్యం తప్పకుండా వస్తుందని అంచానా వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్భన పరిస్థితులు, పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచడాన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది ఆర్థికమాంద్యం వస్తుందని చెబుతోంది. గ్లోబల్ ఎకానమి 2022లో 100 ట్రిలియన్ డాలర్లను అధిగమించిందని.. అయితే ఇది వచ్చే…
In Shraddha Walkar Murder Case, Cops Find New Audio Proof: దేశాన్ని కుదిపేసిన శ్రద్ధావాకర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు అఫ్తాబ్ పూనావాాలా, శ్రద్ధాతో గొడవపడుతున్న ఆడియో క్లిప్ ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఈ ఆడియో క్లిప్ కీలకంగా పరిగణిస్తున్నారు పోలీసులు. దీన్ని పెద్ద సాక్ష్యంగా పరిణిస్తున్నారు. ఈ భయంకరమైన హత్యకు సంబంధించి అఫ్తాబ్ ఉద్దేశాన్ని నిర్థారించేందుకు ఈ ఆడియో క్లిప్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
CM Bommai assures action in Mangaluru murder case: కర్ణాటకలో మంగళూర్ హత్య ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ ప్రారంభించారు పోలీసులు. ఘటనకు కారణం అయినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హామీ ఇచ్చారు. ఆందోళన చేస్తున్న ప్రజలు శాంతి భద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు శాంతిగా ఉండాలని కోరారు.
Tata Punch EV to be launched in India: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ల అమ్మకాలు పెరుగుతున్నాయి. క్రమంగా ఎలక్ట్రిక్ టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈవీ కార్ల విభాగంతో దేశంలోనే టాప్ లో ఉంది దేశీయ కార్ మేకర్ దిగ్గజం టాటా. టాటా నెక్సాన్ ఈవీ తర్వాతే.. ఇతర కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్ లోకి తీసుకువచ్చాయి. ఇప్పటికీ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటానే అగ్రస్థానంలో ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈవీ సెగ్మెంట్…
Taiwan Says China Deployed 71 Warplanes In Weekend War Drills: జిత్తులమారి చైనా, తైవాన్ పైకి కాలుదువ్వుతోంది. తైవాన్ ద్వీపాన్ని ఆక్రమించుకునే లక్ష్యంతో డ్రాగన్ కంట్రీ పావులు కదుపుతోంది. తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. తాజాగా తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాల పేరుతో చైనా తన యుద్ధవిమానాలను మోహరించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
By mistake Rs. 2 crores credited in accounts.. incident in kerala: పొరపాటున బ్యాంకు తప్పిదాల వల్ల కొన్నిసార్లు అకౌంట్లలో కోట్ల కొద్ది డబ్బు కనిపిస్తుంటుంది. ఇలాంటి ఘటనలు ఇంతకుముందు చాలా సార్లు చూశాం. అయితే కొద్ధి సేపట్లోనే బ్యాంకులు తమ తప్పిదాలను సరిదిద్దుకుంటున్నాయి. సాఫ్ట్ వేర్ సమస్యల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇదిలా ఉంటే కేరళలో ఓ ఘటన జరిగింది. బ్యాంకు పొరపాటు వల్ల ఇద్దరు యువకుల ఎకౌంట్లలో ఏకంగా రూ. 2.44 కోట్ల డబ్బులు జమయ్యాయి. ఈ…
Increased cold intensity in northern states: దేశంపై చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు చలితో వణుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే కొద్ది రోజులు చలిగాలుల పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వారం రోజులుగా చలిగాలుల ప్రభావం ఉంది. ఢిల్లీలో ఆదివారం ఉష్ణోగ్రత 5.3 డిగ్రీలకు పడిపోయింది. సాధారణం కన్నా మూడు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత రికార్డ్ అయింది.
Male Afghan Students Boycott Classes, Protest Women's Education Ban: మహిళా విద్యార్థులు యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించకుండా తాలిబాన్ పాలకులు బ్యాన్ విధించారు. దీనిపై పెద్ద ఎత్తున విద్యార్థినులు నిరసన తెలుపుతున్నారు. యూనివర్సిటీ గేట్ల ముందు విలపిస్తూ యువతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీని కన్నా తమ తలలు నరకడం మంచిదని అమ్మాయిలు అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ లో జంతువులకు ఉన్న స్వేచ్ఛ మహిళలకు లేదని.. కుక్క కూడా వీధుల్లో తిరుగుతుంది కానీ..అమ్మాయి ఇళ్లకే పరిమితం అవుతున్నారంటూ తాలిబాన్ పాలకులపై ఆగ్రహం వ్యక్తం…