Vladimir Putin Says West Wants To “Tear Apart” Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి 10 నెలలు పూర్తయ్యాయి. అయినా ఇప్పడప్పుడే యుద్ధం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. వెస్ట్రన్ దేశాలు రష్యాను విచ్ఛిన్నం చేయడాని ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని సమర్థించారు పుతిన్. ఇది రష్యన్లను ఏకం చేయడానికే అని అన్నారు. ఉక్రెయిన్లు కూడా రష్యన్లే అని ఆయన అన్నారు.
రష్యా రాజకీయ ప్రత్యర్థులు దేశాన్ని ముక్కలుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. విభజించి జయించాలని వెస్ట్రన్ దేశాలు భావిస్తుంటాయని.. కానీ మా లక్ష్యం మాత్రం రష్యన్ ప్రజలను ఏకం చేయడమే అని అన్నారు. తన ప్రభుత్వం సరైన దిశలో వ్యవహరిస్తోందని.. జాతీయ ప్రయోజనాలను, మన పౌరుల ప్రయోజనాలను పరిరక్షిస్తోందని అన్నారు. రష్యా ఇప్పటికీ చర్చలకు సిద్ధంగా ఉందని మరోసారి స్పష్టం చేశారు. అమెరికా నుంచి ఉక్రెయిన్ పొందుతున్న పేట్రియాట్ క్షిపణి వ్యవస్థను 100 శాతం నాశనం చేస్తామని హెచ్చరించారు.
Read Also: Pushpa Kamal Dahal: నేపాల్ ప్రధానిగా ప్రచండ.. ముగిసిన సంక్షోభం
ఫిబ్రవరిలో ప్రారంభం అయిన ఉక్రెయిన్ యుద్ధం పదినెలలగా సాగుతోంది. చర్చలకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మాత్రం పుతిన్ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు రష్యాతో చర్చలు లేవని తెసేసి చెబుతున్నాడు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా ధ్వంసం అవుతున్నా.. పట్టించుకోవడం లేదు. అమెరికా, పాశ్చాత్య దేశాలు ఇస్తున్న ఆయుధ, ఆర్థిక సహాయంతో రష్యాకు ఎదురొడ్డి నిలుస్తోంది రష్యా. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ లోని ఖేర్సన్, జపొరొజ్జియా, డోనెట్స్క్, లూహాన్స్క్ ప్రాంతాలను రష్యా తనలో కలుపుకుంది. ఇక ఇటీవల జెలన్ స్కీ కొన్ని రోజుల క్రితం అమెరికాలో పర్యటించి, సైనిక సాయాన్ని కోరాడు. దీంతో రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది.