Pushpa Dahal ‘Prachanda’ Appointed Nepal’s Prime Minister For Third Time: నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ దహల్(ప్రచండ) నియమితులయ్యారు. మూడో సారి ప్రధాని పీఠాన్ని చేజిక్కించుకున్నారు ప్రచండ. నేపాలీ కాంగ్రెస్ పార్టీలో సంకీర్ణంలో ఉన్న ప్రచండ, తన పార్టీ అయిన సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రస్తుతం ప్రధానిగా ఉన్న షేర్ బహదూర్ దేవుబా తన పదవని కోల్పోనున్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్ధాం అని అనుకున్న నేపాలీ కాంగ్రెస్-మావోయిస్టు సెంటర్ మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ మద్దతుతో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
అధ్యక్షురాలు బిద్యా దేవీ భండారీ ఆదివారం పుష్పకమల్ దహల్ ను ప్రధానిగా నియమించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 క్లాజ్ 2 ప్రకారం ప్రచండ నేపాల్ ప్రధానిగా నియమితులవుతున్నట్లు నేపాల్ రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ఈ ఆర్టికల్ ప్రకారం రెండు లేదా అంతకన్నా పార్టీల మద్దతుతో పార్లమెంట్ లో మెజారిటీ సాధిస్తే ఆ పార్టీల్లోని ఎన్నుకోబడిన ఏ అభ్యర్థి అయిన ప్రధానిగా బాధ్యతలు చేపట్టవచ్చు. ప్రధాని ప్రమాణ స్వీకారం సోమవారం సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది.
Read Also: Uttar Pradesh: మతం మార్చుకుని పెళ్లి చేసుకుంది.. చివరకు కరెంట్ షాక్‌తో చంపిన భర్త
నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ప్రచండల మధ్య విభేదాలు రావడంతో ఆయన సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి మద్దతుతో ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే చెరో రెండున్నరేళ్ల పాటు ప్రధాని పదవులను పంచుకోవాలనే ఒప్పందంతో ఈ పొత్తు కుదిరింది. ఓలీతో పాటు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) అధ్యక్షుడు రవి లమిచానే, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అధినేత రాజేంద్ర లింగ్‌డెన్‌తో పాటు మొత్తం 6 పార్టీలు ప్రచండకు మద్దతు పలికాయి.
275 మంది సభ్యుల ప్రతినిధుల సభలో ప్రచండకు 165 మంది మద్దతు ఉంది. ఇందులో సీపీఎణ్-యూఎంఎల్ కి 78, సీపీఎన్-ఎంసీ కి 32, ఆర్ఎస్పీ కి 20, ఆర్పీపీకి 14, జేఎస్పీకి 12, జనమత్ కి 6, నాగరిక్ ఉన్ముక్తి పార్టీకి 3 మంది సభ్యులు ఉన్నారు. 89 స్థానాలతో నేపాలీ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉండనుంది. 1996-2006 మధ్య జరిగిన సాయుధ పోరాటానికి ప్రచండ నాయకత్వం వహించాడు. దశాబ్ధం పాటు అండర్ గ్రౌండ్ లోనే గడిపాడు. ఇప్పటికి రెండు పర్యాయాలు నేపాల్ కు ప్రధానిగా పనిచేశారు. తాజాగా మూడోసారి ప్రధాని కాబోతున్నారు.