Causes of Joshimath Sinking: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాల్లో ఉన్న జోషిమఠ్ పట్టణం కుంగిపోతోంది. అక్కడి ఇప్పటికే 500కు పైగా ఇళ్లు బీటలువారాయి. రోడ్లు కోతలకు గురువుతున్నాయి. దీంతో చాలా మంది ప్రజలను ఆ ప్రాంతం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రాంతానికి తరలిస్తోంది. శనివారం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పట్టణంలో పర్యటించారు. ప్రజలకు పునరావాసం కల్పించడంతో కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలను తరలించేందుకు హెలికాప్టర్లను సిద్ధం చేసింది ప్రభుత్వం.
Peeing in open on campus, BJP targets Kanhaiya Kumar over urinating incident: ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన సంఘటన దేశంలో విమానయాన రంగంలో సంచలనంగా మారింది. డీజీసీఏ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఎయిర్ లైన్స్ సంస్థలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇదిలా ఉంటే జవహర్లాల్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడని చెబుతూ ప్రస్తుతం బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ఎన్నిలక యాత్ర కాదని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా చూపించడం ఈ యాత్ర ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఇది సైద్ధాంతిక యాత్ర అని.. ఈ యాత్రలో రాహుల్ గాంధీ ప్రముఖంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు ‘భారత్ జోడో యాత్ర’ కసరత్తు చేస్తుందనే వాదనలను ఆయన శనివారం కొట్టిపారేశారు.
People's Anti-Fascist Front Ban: పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైష్-ఏ-మహ్మద్ ఉగ్ర సంస్థకు ప్రాక్సీగా వ్యవహరిస్తున్న ‘పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్’ (పీఏఎఫ్ఎఫ్)పై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఉగ్రవాద నిరోధక చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ)చట్టం(యూఏపీఏ)-1967 కింద ఈ నిషేధం విధించింది. లష్కరే తోయిబా సబ్యుడు అర్బాజ్ అహ్మద్ మీర్ ను వ్యక్తిగత ఉగ్రవాదిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Mobile Phone Explodes While Talking: ఇటీవల కాలంలో సెల్ ఫోన్ల మాట్లాడుతుండగా పేలడం, ఛార్జింగ్ సమయంలో షాక్ తో పలువురు మరణించిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో సెల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్న సమయంలోనే పేలాయి. ఇదిలా ఉంటే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా పేలుడు సంభవించింది. దీంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు
Schoolboy Hit By Car, Dragged For 1 km In UP: ఢిల్లీ రోడ్ టెర్రర్ ఘటన మరవక ముందే ఉత్తర్ ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. స్కూల్ పిల్లాడిని ఢీకొట్టిన కారు, ఒక కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది. ఉత్తర్ ప్రదేశ్ హర్డోయ్ లో 15 ఏళ్ల స్కూల్ విద్యార్షిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన ఢిల్లీ తరహా ఘటనను పోలిఉంది. శుక్రవారం సాయంత్రం 9వ తరగతి విద్యార్థి కోచింగ్ క్లాసుకు వెళ్తుండగా వ్యాగన్ ఆర్ కారు అతడి సైకిల్ పై…
Pakistan Economic Crisis: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మరికొన్ని రోజుల్లో దివాళా తీసే పరిస్థితి ఏర్పడింది. శ్రీలంక పరిస్థితులు పాకిస్తాన్ లో పునరావృతం కాబోతున్నాయి. కరెంట్ ఆదా చేసేందుకు రాత్రి 8 గంటల తర్వాత మాల్స్, మార్కెట్లు, కళ్యాణ మండపాలను మూసేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెరుగుతున్న అప్పులు, ఇంధన దిగుమతి ఖర్చులు, క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలు, ద్రవ్యోల్భనం, రాజకీయ అస్థిరత, జీడీపీ వృద్ధిలో మందగమనం ఇలా సవాలక్ష సమస్యలు పాకిస్తాన్ ను చుట్టుముట్టాయి.
Rahul Gandhi criticizes Prime Minister Narendra Modi: భారత్ జోడో యాత్రలో మరోసారి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ, బీజేపీ పాలనపై శుక్రవారం విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో రెండు భారతదేశాల ఉన్నాయని.. ఒకటి రైతులు, కార్మికులు, నిరుద్యోగులతో కూడినది అయితే రెండోది 100 మంది ధనవంతులకు చెందినదని.. వీరి చేతుల్లోనే దేశ సంపద సగం ఉందని అన్నారు. హర్యానా పానిపట్ లో జరిగిన ర్యాలీలో అగ్నిపథ్ స్కీమ్, జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
29 Killed During Capture Of Drug Lord El Chapo's Son: మెక్సికన్ డ్రగ్ లార్డ్ జోక్విన్ ఎల్ చాపో గుజ్మాన్ కొడుకు ఒవిడిలో గుజ్మాన్ ను పట్టుకునేందుకు మెక్సికో ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో దాదాపుగా 29 మంది మరణించారు. ప్రస్తుతం జోక్విల్ గుజ్మాన్ మెక్సికోలో జైలులో ఉన్నాడు. ప్రభుత్వ దళాలు, గుజ్మాన్ ముఠాకు చెందిన సభ్యుల మధ్య గురువారం భీకరమైన దాడులు కొనసాగాయి. మెక్సికో ఉత్తర రాష్ట్రమైన సినాలోవాలో ఈ కాల్పలుు చోటు చేసుకున్నాయి.
Aaftab seeks release of debit, credit cards for clothes: ఢిల్లీలో హత్యకు గురైన శ్రద్ధావాకర్ కేసు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. లివ్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేసి, శరీరాన్ని 35 ముక్కులగా నరికి ఢిల్లీ శివార్లలో పారేశాడు. మే నెలలో హత్య జరిగితే.. ఆరు నెలల తర్వాత శ్రద్ధా తండ్రి ఫిర్యాదులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అఫ్తాబ్ నేరాన్ని అంగీకరించాడు. అతనికి…