Blood type may predict risk of stroke before 60: శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన పరిశోధనల్లో కొన్ని బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి ‘స్ట్రోక్’ ప్రమాదం ఎక్కువగా ఉందని కనుక్కున్నారు. ఈ ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఓ మార్గాన్ని కనుక్కున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మేరిల్యాండ్ కు చెందిన పరిశోధకులు బృదం న్యూరాలజీ జర్నల్ లో ఈ అధ్యయాన్ని ప్రచురించింది. ఒక వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూపుకు సంబంధించిన జన్యు వైవిధ్యాలను విశ్లేషించి స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని అంచనా వేశారు. మెదడుకు వెళ్లే రక్తాన్ని అడ్డుకోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతున్నాయి ఈ బ్లడ్ గ్రూపులు.
Read Also: Pak Father: వయసు 50.. ముగ్గురు భార్యలు.. సంతానం 60.. నాలుగో పెళ్లికి రెడీ
ముఖ్యంగా కొన్ని రక్తవర్గాలు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారిలో తొందరగా స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెంచుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ‘O’ బ్లడ్ గ్రూపు కాకుండా ఇతర బ్లడ్ గ్రూపుల్లో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. తక్కువ వయసులో వచ్చే స్ట్రోక్, వయసు పైబడిన తర్వాత వచ్చే స్ట్రోక్ లకు బ్లడ్ గ్రూపులతో సంబంధాన్ని కలిగి ఉన్నట్లు తేలింది. ఆయా రక్త వర్గాల్లో ఉన్న జన్యు వైవిధ్యాల కారణంగా రక్తం గడ్డ కట్టే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ఎర్లీ స్ట్రోక్ ను 60 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారిగా, లేట్ స్ట్రోక్ ను 60కి పైబడిన వారిగా విభజించారు.
అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో జన్యుపరంగా బ్రెయిన్ కు వచ్చే ‘ఇస్కీమిక్ స్ట్రోక్’పై 48 అధ్యయనాలు చేశారు. ఈ అధ్యయనాల్లో 18-59 సంవత్సరాల వయస్సు గల 16,927 మందిపై అధ్యయనం చేశారు. వీరంతా స్ట్రోక్ వచ్చినవారు. 5,76,353 మంది స్ట్రోక్ రాని వారిలో అధ్యయనం చేశారు. వీరిలో 5,825 మందికి తక్కువ ఏజ్ లో స్ట్రోక్ వచ్చింది, 9,269 మందిలో లేట్ గా స్ట్రోక్ వచ్చినట్లు పరిశోధకులు గమనించారు. తక్కవ వయసులో స్ట్రోక్ తో బాధపడుతున్నవారిలో ‘A’ గ్రూపు రక్త వర్గం కలిగిన వారు ఎక్కువగా ఉంటే.. ‘B’ బ్లడ్ గ్రూపు ఉన్నవారిలో త్వరగా, ఆలస్యంగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని.. ఇక ‘O’ బ్లడ్ గ్రూపు ఉన్నవారిలో స్ట్రోక్ ప్రమాదం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.