Mid-Air “Peeing” Incident: ఇటీవల న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు ఓ వ్యక్తి. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తీవ్ర ఆగ్రహంతో ఉంది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ కేసులో జాతీయ మహిళా కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఎయిరిండియా అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఇటు డీజీసీఏ, అటు ఎయిరిండియా సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై ఎయిరిండియా 30మ రోజుల నిషేధాన్ని విధించింది. ప్రస్తుతం నిందితుడు ముంబైలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన నవంబర్ 26న జరిగింది. అయితే మహిళ ఎయిరిండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
Read Also: Prince Harry : మా అన్న నన్ను పడేసి తన్నాడు.. అందుకే నడుం నొప్పి వచ్చింది
ఈ ఘటన మరవకముందే ఇలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 6న పారిస్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో కూడా ఓ వ్యక్తి మద్యం మత్తులో ఓ మహిళ ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశారు. అయితే ప్రయాణికుడు వ్రాత పూర్వక క్షమాపణ చెప్పడంతో ఆ వివాదం అక్కడితో సద్దుమణిగింది. దీంతో అతనిపై ఎలాంటి శిక్షార్హమైన చర్య తీసుకోలేదని అధికారులు గురువారం తెలిపారు.
డిసెంబర్ 6న ఎయిరిండియా ఫ్లైట్ 142లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఫ్లైట్ పైలట్ విషయాన్ని ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి నివేదించాడు, ఆ తర్వాత ప్రయాణీకుడిని పట్టుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు క్యాబిన్ సిబ్బంది సూచనలను పాటించలేదని అధికారులు తెలిపారు. విమానం దిగిన వెంటనే సదరు ప్రయాణికుడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) పట్టుకుంది. అయితే ప్రయాణికుడు, మహిళ ప్రయాణికురాలికి వ్రాతపూర్వక క్షమాపణలు చెప్పడంతో పరస్పరం రాజీ కుదిరింది. మహిళా ప్రయాణికురాలు పోలీస్ కేసు పెట్టడానికి నిరాకరించింది. దీంతో ఇమ్రిగ్రేషన్, కస్టమ్స్ ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత ప్రయాణికుడిని బయటకు అనుమతించారు.