DGCA directives to airlines: ఎయిరిండియా ఘటన దేశవ్యాప్తంగా విమానయాన రంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మహిళపై మూత్రవిసర్జన చేశాడు. ఈ ఘటనపై ఇప్పటికే ఎయిర్ లైనర్ రెగ్యులేటర్ అథారిటీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.
Air India Incident: ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన విమానయాన రంగంలో ప్రకంపనలు రేపుతోంది. నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా తన తోటి ప్రయాణికురాలు సీనియర్ సిటిజన్ అయిన మహిళపై మూత్ర విసర్జన చేశాడు. మద్యంమత్తులో ఇలాంటి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే ఆ సమయంలో ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ మెంబర్లు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. ఈ ఘటనపై మహిళ ఎయిర్ ఇండియా సిబ్బందికి…
jammu ksahmir leaders rejoin Congress, quit Azad's party: మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ పెట్టుకున్నాడు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రిగా పనిచేసిన ఆజాద్, డెమోక్రాటిక్ ఆజాద్ పార్టీ(డీఏపీ)ని ప్రారంభించారు. దీంతో కాశ్మీర్ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీలో చేరారు. ఇదిలా ఉంటే తాజాగా ఆజాద్ కు షాక్ ఇస్తున్నారు నేతలు. మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు. ఆజాద్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో ఆ పార్టీ అగ్రనాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
5 drunk men pour hot oil on hotel owner: చెన్నై సమీపంలో ఓ హోటల్ యజమాని, అతని కొడుకు, సిబ్బందిపై ఐదుగురు తాగుబోతులు దాడిచేశారు. అంతటితో ఆగకుండా వేడి నూనెను వారిపై పోశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన చెన్నై శివారులోని సెలైయూర్ సమీపంలోని మాడంబాక్కంలో జరిగింది.
Premium Android Phones To Soon Get Satellite Connectivity: ప్రస్తుతం ప్రపంచం మొత్తం కేవలం అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ లో ఇమిడిపోయింది. 4జీ, 5జీ టెక్నాలజీ రావడంతో అన్ని సేవలను మొబైల్ ఫోన్ల నుంచే పొందుతున్నాం. ఇప్పటి వరకు మొబైల్స్ సెల్ టవర్ సిగ్నల్స్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పనిచేశాయి. ఇకపై వచ్చే ప్రీమియం స్మార్ట్ ఫోన్లు ఇక నేరుగా శాటిలైట్లతో అనుసంధానం కాబోతున్నాయి. వచ్చే ఏడాది ఈ టెక్నాలజీతో ఆండ్రాయిడ్ ఫోన్లు రాబోతున్నాయి. నేనుగా ఈ మొబైల్స్ శాటిలైట్లతో…
Anushka Sharma, Virat Kohli Attend Discourse At Vrindavan Ashram: ఇండియన్ క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి బృందావన్ ఆశ్రమానికి వెళ్లారు. ఇప్పుడు వీరి వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. స్పెషల్ అట్రాక్షన్ గా వీరిద్దరి కూతురు వామిక నిలిచింది. తొలిసారిగా వామికను చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఈ స్టార్ కపుల్ సంత్ ప్రేమానంద్ మహారాజ్ చెబుతున్న మాటలు ఆసక్తిగా వింటున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం వారు…
AAP, BJP councillors clash inside MCD house, Delhi Mayor elections postponed: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్ ఎన్నిక బీజేపీ, ఆప్ పార్టీ మధ్య తీవ్ర గొడవకు దారి తీసింది. ఆప్, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. టేబుళ్లు, కుర్చీలు విసిరేసుకున్నారు. దీంతో మొత్తం గందరగోళంగా మారడంతో మేయర్ ఎన్నిక వాయిదా పడింది. తదుపరి నోటీసు ఇచ్చేంత వరకు ఎన్నికను వాయిదా వేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన తాత్కాలిక స్పీకర్ సత్య శర్మ,
Heeng health benefits: ఇంగువ ప్రత్యేకంగా పరిచయం అక్కర లేని వంట పదార్థం. ముఖ్యంగా సాంబార్, పప్పుల్లో వీటిని తరుచుగా వాడుతుంటాము. అసఫోటిడా అని పిలిచే ఇంగువ చెట్టు నుంచి వస్తుంది. దీన్ని పౌడర్ గా చేసి వంటల్లో వాడుతుంటారు. భారత దేశంలోనే కాకుండా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాల్లో కూడా ఇంగువను విరివిగా వాడుతుంటారు. దీన్ని దేవతల ఆహారంగా కూడా పిలుస్తుంటారు.
Centre bans TRF: కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని మళ్లీ ప్రారంభించాలని చూస్తున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’(టీఆర్ఎఫ్)పై కేంద్రం నిషేధం విధింంచింది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తూ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతోంది. అమాయక పౌరులను, హిందువులను, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలను, కాశ్మీర్ పండిట్లను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది.
Covid Infection May Impact Semen Quality In Men: కోవిడ్-19 ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. మూడేళ్లు గడిచినా.. రూపాలను మార్చుకుంటూ మనుషులపై అటాక్ చేస్తోంది. ఇదిలా ఉంటే కోవిడ్ వచ్చి కోలుకున్నప్పటికీ దీర్ఘకాలికంగా దాని ప్రభావానికి గురువుతోంది శరీరం. వ్యాధి తగ్గిపోయినా శ్వాసకోశ ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలతో సతమతం అవుతున్నారు. తాజాగా అధ్యయనం మరో షాకింగ్ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. సార్స్ కోవో-2 వైరస్ సంక్రమించిన తర్వాత వీర్యం నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్లు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) పరిశోధకులు(ఎయిమ్స్)…