Heeng: వంట గదిలో “ఇంగువ”కు ప్రత్యేక స్థానం.. ఉపయోగాలు తెలిస్తే వదలరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heeng health benefits: ఇంగువ ప్రత్యేకంగా పరిచయం అక్కర లేని వంట పదార్థం. ముఖ్యంగా సాంబార్, పప్పుల్లో వీటిని తరుచుగా వాడుతుంటాము. అసఫోటిడా అని పిలిచే ఇంగువ చెట్టు నుంచి వస్తుంది. దీన్ని పౌడర్ గా చేసి వంటల్లో వాడుతుంటారు. భారత దేశంలోనే కాకుండా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాల్లో కూడా ఇంగువను విరివిగా వాడుతుంటారు. దీన్ని దేవతల ఆహారంగా కూడా పిలుస్తుంటారు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
Also Read
శరీరంలో జీర్ణక్రియలను ఇంగువ మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను సులభతరం చేయడానికి భారతీయ వంటల్లో ఇంగువను వాడుతుంటారు. తీవ్రమైన మైగ్రేన్, పాము కాటు నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. శిశువుల్లో గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. 1-2 టేబుల్ స్పూన్ల గోరువెచ్చటి నీటిలో చిటికెడు ఇంగువ మిక్స్ చేసి, యాంటీ క్లాక్ వైజ్ గా శిశువు నాభిపై మర్థన చేయడం వల్ల శిశువులు గ్యాస్ నుంచి ఉపశమనం పొందుతారు. పెద్దవారిలో వచ్చే తీవ్రమైన తలనొప్పి మైగ్రెన్ ను తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇంగువ కలిపిన నీటిని తాగడం వల్ల మైగ్రెన్ సమస్యను తగ్గించుకోవచ్చు.
శ్వాస కోశ, పంటి సమస్యలకు పరిష్కారం:
ఇంగువకు యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు ఉన్నాయి. యాంటీ వైరల్ గా పనిచేస్తుంది. ఉబ్బసం, బ్రోన్కైటిస్, పొడి దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించబడింది. సగం టీ స్పూన్ ఇంగువ పొడి, అల్లం పొడిని 2 టేబుల్ స్పూన్ల తేనెతో కలిపి రోజుకు రెండు మూడుసార్లు తీసుకుంటే శ్వాశకోశ సమస్యలు తీరుతాయి. పంటినొప్పిని తగ్గిస్తుంది. నొప్పి ఉన్న చోట ఇంగువను ఉంచితే నొప్పినుంచి ఉపశమనం అభిస్తుంది.
నపుంసకత్వానికి చికిత్స, పాము కాటుకు విరుగుడు:
పరుషుల్లో నపుంసకత్వానికి చికిత్స చేయడంలో ఇంగువ చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. ఒక చిటికెడు ఇంగువను నెయ్యిలో వేయించి, ఒక టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ మర్రిచెట్లు నుంచి వచ్చే రబ్బరు పాలతో కలిపి సూర్యోదయానికి ముందు 40 రోజులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. కీటకాలు, పాము కాటుల నుంచి రక్షించే శక్తి ఇంగువకు ఉంది. ఇంగువ పౌడర్ ని నీళ్లలో కలిపి పేస్ట్‌లా చేసి కీటకాలు కాటేసిన స్థలంలో ఉంచాలి. దీంతో కీలకాట విష ప్రభావం తగ్గుతుంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!