Premium Android Phones To Soon Get Satellite Connectivity: ప్రస్తుతం ప్రపంచం మొత్తం కేవలం అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ లో ఇమిడిపోయింది. 4జీ, 5జీ టెక్నాలజీ రావడంతో అన్ని సేవలను మొబైల్ ఫోన్ల నుంచే పొందుతున్నాం. ఇప్పటి వరకు మొబైల్స్ సెల్ టవర్ సిగ్నల్స్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పనిచేశాయి. ఇకపై వచ్చే ప్రీమియం స్మార్ట్ ఫోన్లు ఇక నేరుగా శాటిలైట్లతో అనుసంధానం కాబోతున్నాయి. వచ్చే ఏడాది ఈ టెక్నాలజీతో ఆండ్రాయిడ్ ఫోన్లు రాబోతున్నాయి. నేరుగా మొబైల్స్ శాటిలైట్లతో కనెక్టివిటీని పొందుతాయి.
Read Also: Karan Johar: నన్ను హత్య చేసిన పర్లేదు.. ఆ హీరోలకు అంత సీన్ లేదు.. కరణ్ సంచలన వ్యాఖ్యలు
బీబీసీ నివేదిక ప్రకారం.. సెమికండక్టర్ దిగ్గజ సంస్థ క్వాల్ కామ్, శాటిలైట్ ఫోన్ కంపెనీ ‘ఇరిడియం’ మధ్య కొత్త ఒప్పందం జరిగింది. ధీంట్లో భాగంగా శాటిలైట్ కనెక్టవిటీతో ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు రాబోతున్నాయి. సెల్ సిగ్నల్స్ లేని ప్రాంతంలో కూడా మెసేజుల పంపడానికి, స్వీకరించడానికి నేరుగా శాటిలైట్లతో కనెక్టవిటీని పొందవచ్చు. ప్రస్తుతం చాలా ఆండ్రాయిడ్ ఫోన్ల ఈ క్వాల్ కామ్ ప్రాసెసర్లు, చిప్ సెట్లను కలిగి ఉన్నాయి. అయితే సెప్టెంబర్ 2022లో వచ్చి ఆపిల్ ఐఫోన్ 14కి శాటిలైట్లలో అనుసంధానించవచ్చని ప్రకటించింది. అయితే ఇది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాయిస్ మెసేజును పంపడానికి, రిసీవ్ చేసుకునేందుకు మాత్రమే పరిమితం చేయబడింది.
ఇరిడియం తొలిసారిగా తన శాటిలైట్ ను 1997లో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 2019నాటికి మొత్తం 75 శాటిలైట్ నెట్ వర్క్ తో భూమిపై ప్రతీమూల కవర్ చేయగలుగుతోంది. భూమికి 750 కిలోమీటర్ల ఎత్తులో తిరుగున్న శాటిలైట్ల ద్వారా డేటా మార్పిడి చేసుకోవచ్చు. ఈ నెట్ వర్క్ ద్వారా శాటిలైట్ ఫోన్లు పనిచేస్తున్నాయి. క్వాల్ కామ్ చెబుతున్న దాని ప్రకారం స్నాప్ డ్రాగన్ శాటిలైట్ అని పిలిచే కొత్త ఫంక్షన్ ని ప్రీమియం మొబైల్ హ్యాండ్ సెట్లలోనే కనిపించే అవకాశం ఉంది. శాటిలైట్ కనెక్టవిటీ వల్ల మొబైల్స్ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో కూడా పనిచేస్తాయని.. ముక్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా సిగ్నల్స్ లేని సమయంలో కూడా ఈ ఫోన్లు పనిచేయగలవు.