Joshimath Sinking: ఉత్తరాఖండ్ జోషిమఠ్ పట్టణం కుంగిపోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. శనివారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జోషిమఠ్ లో పర్యటించారు. ప్రమాదం అంచున ఉన్న ఇళ్లలోని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే 500 పైగా ఇళ్లు, పలు రోడ్లు బీటలువారాయి. ఇదిలా ఉంటే జోషిమఠ్ సంక్షోభంపై ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారులు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉత్తరాఖండ్ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు హాజరుకానున్నారు.
India Now World's 3rd Largest Auto Market After China And US: ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమార్కెట్ గా ఇండియా ఉంది. ప్రస్తుతం ఈ విషయంలో ఇండియా మరో ఘనత సాధించింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్ గా అవతరించింది. జపాన్ దేశాన్ని అధిగమించి మన దేశం ఈ స్థానంలోకి చేరింది. నిక్కీ ఆసియా ప్రకారం.. మొదటిసారిగా ఇండియా మూడో స్థానానికి చేరినట్లు శుక్రవారం వెల్లడించింది. భారతదేశంలో ఈ ఏడాది వాహనాల విక్రయం కనీసం 4.25 మిలియన్ యూనిట్లుగా ఉందని.. జపాన్…
Huge Mob Attacks Delhi Cops After 3 Nigerians Detained: ఢిల్లీ పోలీసులపై నైజీరియన్ దేశస్తులు దాడి చేశారు. అక్రమంగా నివసిస్తున్న ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో సమారు 100కు పైగా వ్యక్తులు పోలీసు విధులకు ఆటంకం కలిగించారు. పోలీసులను చుట్టుముట్టి ముగ్గుర్ని విడిపించే ప్రయత్నం చేశారు. పోలీసులపై వాగ్వాదానికి దిగి దాడి చేసే ప్రయత్నం చేశారు. యాంటీ డ్రగ్స్ ఫోర్స్ పోలీసులు వీసా గడువు ముగియడంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్స్ సెల్ టీం శనివారం మధ్యాహ్నం 2.30…
New Mahindra Thar: మహీంద్రా థార్, ఈ కారు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. ఆఫ్ రోడింగ్ సామర్థ్యం ఉన్న ఈ కారు ఇటీవల కాలంలో భారీ అమ్మకాలను నమోదు చేసుకుంది. తాజాగా కొత్త థార్ జనవరి 9న భారతదేశంలో విడుదల కానున్నట్లు సమాచారం. గతంతో పోలిస్తే ఈసారి థార్ ధర మరింతగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడున్న థార్ లా కాకుండా కొత్తగా రాబోతోన్న థార్ 1.5 లీటర్ డిజిల్ ఇంజన్ ను కలిగి 2 వీల్ డ్రైవ్ తో రాబోతోంది. దీంతో…
Arrest of two terrorists associated with ISIS: నిషేధిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న ఇద్దరు వ్యక్తులను పశ్చిమబెంగాల్ హౌరాలో అరెస్ట్ చేశారు. కోల్కతా పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) పశ్చిమ బెంగాల్ లోని హౌరా నుంచి ఐసిస్ తో సంబంధం ఉన్న ఎండీ సద్దాం (28), సయీద్ (30)లను శుక్రవారం అరెస్ట్ చేసింది. స్థానిక కోర్టు వీరిని జనవరి 19 వరకు పోలీస్ కస్టడీకి పంపింది. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో వీరిద్దరినీ అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి…
Celestial Wonder: ఫిబ్రవరిలో ఖగోళ అద్భుతం దర్శనమివ్వబోతోంది. గత 50,000 ఏళ్లుగా కనిపించని కొత్త తోకచుక్క C/2022 E3 (ZTF) రాబోయే కొన్ని వారాల్లో కంటికి కనిపించనుంది. ఫిబ్రవరి 2న భూమికి అత్యంత దగ్గరగా రాబోతోంది. రాత్రి ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించబోతోంది. నాసా ప్రకారం.. జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీలోని వైడ్-ఫీల్డ్ సర్వే కెమెరా ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు ఈ తోకచుక్కను గతేడాది మార్చిలో గుర్తించారు. ప్రస్తుతం ఈ తోకచుక్క గురు గ్రహం కక్ష్యలో ఉంది.
Ex Bureaucrats Slam BJP's Pragya Thakur Over "Hindus, Keep Knives" Speech: ‘‘హిందువులు కత్తులను ఉంచుకోండి’’ అంటూ ఇటీవల ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ (సాధ్వీ ప్రగ్యా) కర్ణాటకలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ 103 మంది మాజీ బ్యూరోక్రాట్లు లోక్ సభ స్పీకర్ కు బహిరంగ లేఖ రాశారు. ఎంపీపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. లోక్ సభ నైతిక కమిటీ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
pakistan economic crisis: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి పేకమేడలా కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అక్కడ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి తోడు గ్యాస్, ఇంధన సంక్షోభం నెలకొంది. మరోవైపు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, పాకిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ ప్రభుత్వాన్నే సవాల్ చేస్తున్నారు. ఇక కరెంట్ కోతలు, పిండిధరలు, గ్యాస్ సిలిండర్లు లేకపోవడంతో అక్కడి ప్రజానీకం సతమతం అవుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ తయారీ పరిశ్రమలు కూడా చాాలా వరకు ప్రభావితం అవుతున్నాయి.
Foreign Tourist Harasses Flight Attendants On GO First's Delhi-Goa Flight: విమానాల్లో ప్రమాణికలు అకృత్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే న్యూయార్క్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి సీనియర్ సిటిజెన్ పై మద్యం మత్తులో యూరిన్ చేశాడు. దీని తర్వాత పారిస్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే మరో విమాన ఘటనల తాజాగా వెలుగులోకి వచ్చింది.
Kilauea Volcano In Hawaii Erupts Again: హవాయిలోని కిలాయుయా అగ్నిపర్వతం మళ్లీ పేలింది. జనవరి 5 నుంచి అగ్నిపర్వతం బద్ధలు అవుతూనే ఉంది. గత నవంబర్ లో దీనికి సమీపంలోనే ఉన్న ‘మౌనాలోవా’ అగ్ని పర్వతం పేలింది. ఆ తరువాత ప్రస్తుతం ‘కిలాయుయా’ అగ్నిపర్వతం నుంచి లావా ఎగిసిపడుతోంది. భూమిపై ప్రస్తుతం అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వాతాల్లో కిలాయుయా ఒకటి.