Jammu ksahmir leaders rejoin Congress, quit Azad’s party: మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ పెట్టుకున్నాడు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రిగా పనిచేసిన ఆజాద్, డెమోక్రాటిక్ ఆజాద్ పార్టీ(డీఏపీ)ని ప్రారంభించారు. దీంతో కాశ్మీర్ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీలో చేరారు. ఇదిలా ఉంటే తాజాగా ఆజాద్ కు షాక్ ఇస్తున్నారు నేతలు. మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు. ఆజాద్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో ఆ పార్టీ అగ్రనాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఆజాద్ పార్టీకి గుడ్ బై చెప్పారు జమ్మూ కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారాచంద్. మాజీ పీసీసీ చీఫ్ పీర్జాదా మహ్మద్ సయీద్ తో సహా మొత్తం 17 మంది నాయకులు శుక్రవారం తిరిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండు నెలల తర్వాత మళ్లీ సొంతగూటికి చేరుకోవడంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలు ఆనందం వ్యక్తం చేశారు. మరో రెండు వారాల్లో జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించే భారత్ జోడో యాత్రకు ముందు ఇలా నేతలు కాంగ్రెస్ చేరడం సంతోషకరమైన విషయం అని అన్నారు.
Read Also: MP Asaduddin Owaisi: రూల్స్‌కి విరుద్ధం.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి రెండు చోట్ల ఓటు హక్కు..
భారత్ జోడో యాత్ర దేశంలో పెద్ద ఉద్యమంగా మారిందని.. అందుకే నేతలంగా మళ్లీ కాంగ్రెస్ లోకి రావాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఇది ప్రారంభం మాత్రమే అని.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ భావజాలం ఉన్న, అఖండ భారత్ కోరుకునే వారందరూ పార్టీలో చేరుతారని అన్నారు. తిరిగి వచ్చిన వారంతా రెండు నెలలు సెలవులపై వెళ్లినట్లు భావిస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ అన్నారు. మరోవైపు ఆజాద్ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.
కాశ్మీర్ లో జరిగే భారత్ జోడో యాత్రలో ఫరూక్ అబ్ధుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ శ్రీనగర్ లో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొననున్నారు. భావోద్వేగం, స్నేహం కారణంగా కాంగ్రెస్ పార్టీని విడిచి ఆజాద్ పార్టీలో చేరానని కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారాచంద్ అన్నారు. మా జీవితంలో 50 ఏళ్లు కాంగ్రెస్ లో గడిపామని.. డీఏపీ పార్టీలో సంతోషంగా లేమని ఆయన అన్నారు.