Anushka Sharma, Virat Kohli Attend Discourse At Vrindavan Ashram: ఇండియన్ క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, భార్య అనుష్క శర్మతో కలిసి బృందావన్ ఆశ్రమానికి వెళ్లారు. ఇప్పుడు వీరి వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. స్పెషల్ అట్రాక్షన్ గా వీరిద్దరి కూతురు వామిక నిలిచింది. తొలిసారిగా వామికను చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఈ స్టార్ కపుల్ సంత్ ప్రేమానంద్ మహారాజ్ చెబుతున్న ప్రవచనాలను ఆసక్తిగా వింటున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం వారు బృందావన్ ఆశ్రమానికి హాజరయ్యారు. దాదాపు గంట పాటు ఆశ్రమంలో గడిపారు.
Read Also: Man killed Woman: తనకంటే ఏడేళ్లు చిన్నవాడితో డేటింగ్.. పెళ్లి అనగానే మర్డర్
ఆ సమయంలో విరాట్-అనుష్కల కుమార్తె వామిక తల్లి అనుష్క ఒడిలో కూర్చుని ఉండటం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అనుష్క, విరాట్ నేలపై కూర్చొని, చేతులు జోడించి ప్రార్థనలో ఉన్నట్లు చూడవచ్చు. అనుష్క తలపై వస్త్రాన్ని కప్పుకుంది, తరువాత, ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి వామికను దండతో ఆశీర్వదించాడు.
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ బృందావన్ ఆశ్రమం సందర్శనకు ముందు న్యూఇయర్ కోసం దుబాయ్ వెళ్లారు. కొత్త ఏడాదిని అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్బంగా విరాట్ కోహ్లీ కొన్ని ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. డిసెంబర్11, 2017లో విరాట్ కోహ్లీ, అనుష్మ శర్మ వివాహం చేసుకున్నారు. 2021లో వీరిద్దరిక కూతురు వామిక జన్మించింది. గత నాలుగేళ్లుగా అనుష్క శర్మ నటకు దూరంగా ఉంది. తాజాగా స్పోర్ట్స్ డ్రామా ‘చక్దా ఎక్స్‌ప్రెస్’లో నటిస్తుంది. ఇందులో మహిళ క్రికెటర్ జులన్ గోస్వామి పాత్రను పోషిస్తోంది. ఇక చాలా కాలంగా ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో వీరోచిత విజయాన్ని అందించి ఫామ్ లోకి వచ్చాడు.
Most beautiful video on internet today of virat kohli family pic.twitter.com/YngwtazJ0r
— leishaa ✨ (@katyxkohli17) January 5, 2023