5 drunk men pour hot oil on hotel owner: చెన్నై సమీపంలో ఓ హోటల్ యజమాని, అతని కొడుకు, సిబ్బందిపై ఐదుగురు తాగుబోతులు దాడిచేశారు. అంతటితో ఆగకుండా వేడి నూనెను వారిపై పోశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన చెన్నై శివారులోని సెలైయూర్ సమీపంలోని మాడంబాక్కంలో జరిగింది.
Read Also: Vemula Prashanth Reddy: దేశం మొత్తం కేసీఆర్‌ను పొగుడుతోంది.. అసలు బీజేపీ ఏం చేసింది..?
వివరాల్లోకి వెళితే.. అజిత్, కార్తిక్ అనే ఇద్దరు వ్యక్తులు ఉదయం 10.30 గంటలకు 4 చికెన్ ప్రైడ్ రైస్ ప్యాకెట్లు కావాలని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఆర్డర్ ఇచ్చారు. అయితే డెలివరీ సమయంలో ఇద్దరూ డబ్బులు చెల్లించేందుకు నిరాకరించడంతో గొడవ జరిగింది. తర్వాత చెల్లిస్తామని ఇద్దరు చెప్పారు. అయితే డబ్బులు ఇస్తేనే ఆర్డర్ ఇస్తానని యజమాని చెప్పాడు.
ఈ ఘటన అనంతరం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మద్యం తాగి వచ్చిన ఇద్దరు వ్యక్తులు, మరో నలుగురు స్నేహితులతో కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై దాడికి పాల్పడ్డారు. యజమాని, అతని కొడుకు, సిబ్బందిని తిడుతూ దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చడంతో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి, స్టవ్ పై ఉన్న వేడి నూనెను కౌంటర్ వద్ద ఉన్న యజమాని, అతని కొడుకు, ఇతర సిబ్బందిపై పోశాడు. ఈ దాడి తర్వాత నిందితులంతా అక్కడ నుంచి పరారయ్యారు. ఘటన తర్వాత పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిని జయమణి (59), అతని కుమారుడు మణికందన్ (29), నేపాల్ కు చెందిన ఉద్యోగి నెమ్‌రాజ్ (29)లను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మాడంబాక్కంకకు చెందిన నిందితులు అజిత్, కార్తీక్ అలియాస్ హరిహరన్, ప్రవీణ్ అలియాస్ జాగో, శివ, విక్కీ సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం అధికారులు గాలిస్తున్నారు.