Centre bans TRF: కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని మళ్లీ ప్రారంభించాలని చూస్తున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’(టీఆర్ఎఫ్)పై కేంద్రం నిషేధం విధింంచింది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తూ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతోంది. అమాయక పౌరులను, హిందువులను, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలను, కాశ్మీర్ పండిట్లను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది.
Read Also: Musapet Metro Station: మెట్రోరైలు ముందు దూకిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
టీఆర్ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాలను పెంపొందించడం, ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్, ఉగ్రవాదుల చొరబాటు మరియు పాకిస్తాన్ నుండి జమ్మూ కాశ్మీర్‌లోకి ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా కోసం ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా యువతను రిక్రూట్ చేస్తోందని కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ లో పేర్కొంది. 26/11 ముంబై దాడులకు పాల్పడిన లష్కరే తోయిబాకు ప్రాక్సీగా ఈ సంస్థ పనిచేస్తోంది. తొలిసారిగా 2019లో ది రెసిస్టెంట్ ఫోర్స్ ఉగ్రవాద సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. షేక్ సజ్జాద్ గుల్ దీని కమాండర్ గా పనిచేస్తున్నాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967 ప్రకారం ఇతడిని ఉగ్రవాదిగా గుర్తించింది కేంద్ర హోం శాఖ.
భారతదేశ భద్రత, సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా టీఆర్ఎఫ్ వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థకు చెందిన పలువురిపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాటు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అమీన్ అలియాస్ అబు ఖుబైబ్‌ను ప్రభుత్వం వ్యక్తిగత ఉగ్రవాదిగా ప్రకటించింది కేంద్రం. ప్రస్తుతం ఇతడు లష్కరే తోయిబా లాంచింగ్ కమాండర్ గా వ్యహరిస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్ లో లష్కర్ కార్యకలాపాలను పెంచేందుకు ఇతడు ప్రయత్నిస్తున్నాడు. ఉగ్రవాద దాడులను సమన్వయం చేయడంతో పాటు ఆయుధాలు, పేలుడు పదార్థాల సరఫరా, ఆర్థిక సహాయం వంటి చేయడంలో కీలంగా ఉన్నాడు.