Students, Parents Fall Ill After Eating Food: కేరళలో వరసగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పతినంతిట్ట జిల్లాలో ఓ చర్చ్ లో బాప్టిజం వేడుకలకు హాజరైన గ్రామస్తులు అక్కడి ఫుడ్ తిని అస్వస్థతకు గురయ్యారు. ఆ తరువాత బిర్యానీ తిని ఓ యువతి మరణించింది. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో జరిగిన ఓ ఈవెంట్ లో విద్యార్థులు, తల్లిందండ్రులు ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు.
Bengaluru to be the fastest growing city in Asia-Pacific in 2023: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు ఏవంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేర్లు బెంగళూర్, హైదరాబాద్. ఇప్పుడు ప్రపంచంలో కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెంతున్న నగరాలుగా నిలిచాయి. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక ప్రకారం 2023లో ఆసియా-పసిఫిక్ ప్రాాంతంలో అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న నగరాల్లో బెంగళూర్ ఉంటుందని అంచనా వేసింది. బెంగళూర్ తరువాత హైదరాబాద్ ఉంటుందని నివేదిక తెలిపింది.
Earthquake Strikes Pacific Nation Of Vanuatu: పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం వచ్చింది. పసిఫిక్ దేశం అయిన వనౌటు తీరానికి సమీపంలో ఆదివారం అర్థరాత్రి భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 11:30 గంటలకు 7.0 తీవ్రతతో 27కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. భూకంప కేంద్ర పోర్ట్-ఓల్రీ గ్రామానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది.
Congress leader's son arrested by NIA for ISIS connection: కర్ణాటకలో ఐసిస్ ఉగ్రవాద లింకులు బయటపడుతున్నాయి. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత కొడుకే ఐఎస్ఐఎస్ సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రేషాన్ షేక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అతడితో పాటు హుజైర్ ఫర్హాన్ బేగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. రేషాన్ షేక్ ఉడిపి జిల్లాకు చెందిన వాడు కాగా.. ఫర్హాన్ బేగ్ శివమొగ్గ జిల్లాకు చెందిన వాడు. గురువారం…
Sri Ram Sene Leader Injured After Being Shot: కర్ణాటక రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బెలగావిలో శ్రీరామ్ సేన నేతపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. హిందాల్గా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీరామ్ సేన జిల్లా అధ్యక్షుడు రవికుమార్ కోకిట్కర్ తుపాకీతో కాల్పులు జరిపారు. శ్రీరామ్సేన కార్యకర్తలు హిందుత్వం కోసం నిలబడతారని, ఇలాంటి దాడులకు భయపడబోమని ఆ సంస్థ చీఫ్ ప్రమోద్ ముతాలిక్ ఈ ఘటనను ఖండించారు.
Stampedes across Pakistan as flour shortage intensifies: పాకిస్తాన్ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఎంతలా అంటే ప్రజలకు పిండి, గ్యాస్ ఇవ్వలేని పరిస్థితి ఉంది అక్కడ. చివరకు గోధుమ పిండి కోసం ప్రజలు కొట్టుకోవడం, తొక్కిసలాటలు జరుగుతున్నాయి. తాజాగా సింధ్ ప్రభుత్వం ప్రజలకు సబ్సిడీపై పిండిని సరఫరా చేసింది. మ ఈ సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడటంతో తొక్కిసలాట జరిగింది. మిర్పుర్ఖాస్ జిల్లాలో ఏడుగురు పిల్లల తండ్రి అయిన వ్యక్తి తొక్కసలాటలో చనిపోయాడు.
Nitish Kumar comments on population: బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ జనాభా నియంత్రణ, మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై ప్రతిపక్ష బీజేపీ దుమ్మెత్తిపోస్తోంది. మహిళలు చదువుకోకపోవడం, పురుషులు అజాగ్రత్తగా ఉండటం వల్ల రాష్ట్రంలో జనాభా నియంత్రణలోకి రావడం లేదని వ్యాఖ్యలు చేశారు. శనివారం జేడీయూ నిర్వహిస్తున్న సమాధాన్ యాత్రలో భాగంగా వైశాలిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Joshimath not alone. Uttarkashi, Nainital also at risk of sinking: దేశంలో ప్రస్తుతం జోషిమఠ్ పట్టణం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం హిమాలయ పర్వతాల్లో ఉన్న ప్రముఖ పట్టణాల్లో జోషిమఠ్ ఒకటి. అయితే కొన్ని రోజులుగా జోషిమఠ్ అనూహ్యంగా కుంగిపోతోంది. ఇళ్లు, రోడ్లకు బీటలువారుతున్నాయి. భౌగోళిక పరిస్థితులు, వాతావరణం ఈ పట్టణానికి ప్రమాదాలుగా మారాయి. అయితే ఇలా భూమిలో కూరుకుపోవడం ఒక్క జోషిమఠ్ కు మాత్రమే పరిమితం కాలేదని.. రానున్న రోజుల్లో నైనిటాల్, ఉత్తరకాశీలకు కూడా ప్రమాదం పొంచి ఉందని…
Akhilesh Yadav: సమాజ్ వాదీ పార్టీ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లక్నో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిరసనకు దిగారు. ఉత్తర్ ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ కార్యకర్త మనీస్ జగన్ అగర్వాల్ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. దీంతో పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లక్నోలోని పోలీస్ ప్రధాన కార్యాలయం మందు నిరసన తెలిపారు. పోలీసులు చట్టవ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Rahul Gandhi says Congress will form govt in Hindi belt: దక్షిణాదిలో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ‘భారత్ జోడో యాత్ర’కు మంచి స్పందన వచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరాదిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. హర్యానా కురుక్షేత్రలో ఆయన మీడియాతో ఆదివారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర భయం, ద్వేషం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాటికి వ్యతిరేకమని ఆయన అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు, హిందీ బెల్టులో యాత్రకు ప్రజల నుంచి మంచి…