Bengaluru to be the fastest growing city in Asia-Pacific in 2023: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు ఏవంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేర్లు బెంగళూర్, హైదరాబాద్. ఇప్పుడు ప్రపంచంలో కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నన నగరాలుగా పేరు సంపాదించుకుంటున్నాయి. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక ప్రకారం 2023లో ఆసియా-పసిఫిక్ ప్రాాంతంలో అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న నగరాల్లో బెంగళూర్ ఉంటుందని అంచనా వేసింది. బెంగళూర్ తరువాత హైదరాబాద్ ఉంటుందని నివేదిక తెలిపింది.
Read Also: Waltair Veerayya: అన్న ఫంక్షన్ లో తమ్ముడి గురించే చర్చ
ఈ ప్రాంతంలో ప్రధాన నగరాలైన బ్యాంకాక్, షాంఘై, బీజింగ్, హాంకాంగ్, టోక్యోల నుంచి బెంగళూర్ గట్టిపోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది. భారతదేశంలో సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూర్ నగరానికి ఐటీ, కమ్యూనికేషన్ రంగాలు అభివృద్ధికి ప్రధానమైన తోడ్పాటును ఇస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ విశ్లేషణ ప్రకారం.. 2023లో బెంగళూర్ 6 శాతం వృద్ధిని సాధిస్తుందని అంచానా వేసింది. బెంగళూర్ తో పాటు హైదరాబాద్ కూడా ఇదే విధంగా అభివృద్ధి చెందుతుందని తెలిపింది. ఈ రెండు రంగాలు తయారీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తాయని వెల్లడించింది.