Paskistan Crisis: పిండి కోసం తొక్కిసలాట.. కొట్టుకుంటున్న ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stampedes across Pakistan as flour shortage intensifies: పాకిస్తాన్ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఎంతలా అంటే ప్రజలకు పిండి, గ్యాస్ ఇవ్వలేని పరిస్థితి ఉంది అక్కడ. చివరకు గోధుమ పిండి కోసం ప్రజలు కొట్టుకోవడం, తొక్కిసలాటలు జరుగుతున్నాయి. తాజాగా సింధ్ ప్రభుత్వం ప్రజలకు సబ్సిడీపై పిండిని సరఫరా చేసింది. మ ఈ సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడటంతో తొక్కిసలాట జరిగింది. మిర్‌పుర్‌ఖాస్ జిల్లాలో ఏడుగురు పిల్లల తండ్రి అయిన వ్యక్తి తొక్కసలాటలో చనిపోయాడు.
Read Also: Hardik Pandya: సూర్యకుమార్‌కు బౌలింగ్ చేస్తే ఆ షాట్లకు భయపడేవాడిని
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
పాకిస్తాన్ వ్యాప్తంగా పిండి రేట్లు ఆకాశానికి అంటడంతో సింధ్ ప్రభుత్వం సబ్సిడీపై రూ. 65లకే 10 కిలోల పిండిని విక్రయిస్తోంది. అయితే పిండి బస్తాలను తెచ్చిన ట్రక్కు చుట్టు ప్రజలు పెద్ద ఎత్తన గుమిగూడటం, ముందుగా పిండిని తీసుకోవాలని చూడటంతో తొక్కిసలాట జరిగింది. 40 ఏళ్ల హర్ సింగ్ కోలీ ఈ గందరగోళంలో కింద పడిపడిపోయి చనిపోయాడు. ఈ మరణంతో బాధితుడి కుటుంబీకులు ఐదు గంటల పాటు నిరసనకు దిగారు. సింధ్ ప్రాంతంలో పిండి విక్రయం గందరగోళానికి దారి తీసింది. పలు ప్రాంతాల్లో ప్రజలు గాయపడ్డారు. మైనర్ బాలికతో పాటు ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
గతేడాది అక్టోబర్ నెలలో పాకిస్తాన్ వ్యాప్తంగా భారీగా వరదలు సంభవించాయి. మూడోంతుల భూభాగం నీటితో నిండిపోయింది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో గోధుమకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పాకిస్తాన్ లో ఇటీవల కాలంలో పిండి ధరలు తీవ్రంగా పెరిగాయి. కిలో పిండి ధర రూ. 140 నుంచి రూ.150కి పెరిగింది. పెషావర్ ప్రాంతంలో 10 కిలోల పిండి ధర పాక్ రూపాయల్లో రూ. 1500గా ఉంది. ఇక క్వెట్టా ప్రాంతంలో 20 కిలోల పిండి ధర రూ. 2800 గా ఉంది. బలూచిస్తాన్ ప్రాంతంలో గోధుమ స్టాక్ ముగిసిందని సంక్షోభం ముందర ఉందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!