Dense fog delays 40 flights in Delhi: ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో పాటు పలు ప్రాంతాల్లో పొగమంచు కుమ్ముకుంది. ముఖ్యంగా ఢిల్లీ చలిగాలుల తీవ్రతతో తీవ్రంగా ప్రభావితం అవుతోంది. దీంతో పాటు దట్టమైన పొగమంచు ఢిల్లీ వ్యాప్తంగా ఏర్పడింది. దీంతో సమీపంలోని పరిసరాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది.
Bajrang Dal Activist Killed in Assam: అస్సాం కరీంగంజ్ లో హిందూ సంస్థ భజరంగ్ ధళ్ కార్యకర్త హత్య ఉద్రిక్తతలను పెంచుతోంది. 16 ఏళ్ల భజరంగ్ దళ్ కార్యకర్తను అనిముల్ హక్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కరీంగంజ్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో లోవైర్ పోవాలో శుంభు కోయిరి అనే యువకుడిని అనిముల్ హక్ కొత్తితో పొడిచి చంపాడు. నిందితుడు అనిముల్ హక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
Get Out Ravi: తమిళనాడులో పొలిటికల్ వివాదం రాజుకుంది. గవర్నర్ ఆర్ ఎన్ రవి, సీఎం ఎంకే స్టాలిన్ మధ్య విభేదాలు తలెత్తాయి. అధికార డీఎంకే, గవర్నర్ మధ్య వివాదం ముదిరింది. రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ఆర్ ఎన్ రవి ప్రసంగం వివాదానికి కేంద్ర బిందువు అయింది. ‘‘ గెట్ అవుట్ రవి’’ అనే యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. తమిళనాడు ప్రజలు, డీఎంకే పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గవర్నర్ రవికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు.
Man's Hand Chopped Off In Haryana: హర్యానాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై దాడిచేసి చేయిని నరికేశారు. అంతటితో ఆగకుండా నరికిన చేయిన తీసుకుని వెళ్లారు దుండగులు. ఈ ఘటనలో బాధితులుడు తీవ్రగాయాలపాలై చావుబతుకుల మధ్య ఉన్నారు. హర్యానాలోని కురుక్షేత్రలో ఈ ఘటన జరిగింది. జగ్ను అనే వ్యక్తిపై సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుక్షేత్ర హవేలీలో ఈ దాడి జరిగింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని.. లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రి చికిత్స తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
US flood aid to Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ కు మరోసారి భారీ ఆర్థిక సాయం చేసింది అమెరికా. వరదలతో అతలాకుతలం అయిన పాకిస్తాన్ ను ఆదుకునేందుకు 100 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునర్నిర్మాణం, వ్యాధులు ప్రభలకుండా, ఆర్థిక వృద్ధి, ఆహారం కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు. మానవతా సాయం కింద పాకిస్తాన్ కు నిధులు ఇస్తున్నట్లు యూఎస్ విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించారు. గతంలోొ కూడా వరద సాయం కింద పాకిస్తాన్ కు 100…
Stray dog attacks 7-year-old boy in Gujarat's Dahod: ఇటీవల కాలంలో వీధికుక్కల దాడులు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో వీధికుక్కులు అక్కడి ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఢిల్లీలో కూడా గతంలో కుక్కల దాడిలో పలువురు గాయపడ్డారు. ఇదిలా ఉంటే గుజరాత్ లో వీధికుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. బాలుడు ఇద్దరు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో వీధికుక్క దాడి చేసింది. ఫతేపురా గ్రామంలోని ముఖేష్ అనేబాలుడు అతని ఇద్దరు…
Himachal cabinet expansion sparks dissent in Congress: చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించింది. గెలుపొందిన సంతోషంలో ఉన్న కాంగ్రెస్ లో లుకలుకలు కనిసిస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తిని రాజేసింది. కాంగ్రా ఎమ్మెల్యే సుధీర్ శర్మ, ఘరావిన్ ఎమ్మెల్యే రాజేష్ ధర్మాని అధిష్టానంపై బహిరంగంగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు క్యాబినెట్ విస్తరణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Moscow-Goa Flight With 244 Onboard Lands In Gujarat After Bomb Threat: రష్యా రాజధాని మాస్కో నుంచి గోవా వస్తున్న అంజూర్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విమానాన్ని గుజరాత్ జామ్‌నగర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో బాంబు ఉందని గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు జామ్ నగర్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే బాంబ్ స్క్వాడ్‌తో పాటు అగ్నిమాపక సిబ్బంది విమానాశ్రయానికి చేరుకున్నాయి.…
Viral Video: అయోధ్య జైలు నుంచి విడుదల అయిన 98 ఏళ్ల వృద్ధుడికి ఘనంగా వీడ్కోలు చెప్పారు జైలు సిబ్బంది. ఇతరులతో గొడవ పడిన కారణంగా ఐపీసీ 452, 323, 352 సెక్షన్ల కింద 98 ఏళ్ల రామ్ సూరత్ అనే వ్యక్తికి జైలు శిక్ష విధించారు. ఐదేళ్ల పాటు ఆయన జైలులో శిక్ష అనుభవించారు. తాజాగా విడుదల అయ్యారు.
Cold Wave In Delhi: ఉత్తరాదిని చలి వణికిస్తోంది. ఢిల్లీతో పాటు హర్యానా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం ఢిల్లీలో 1.9 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. ఇది గడిచిన రెండేళ్లలో జనవరి నెలలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. ఢిల్లీలోని ప్రైవేట్ స్కూళ్లకు జనవరి 15 వరకు సెలవులను పొడగించింది ప్రభుత్వం. ప్రైవేటు పాఠశాలలు జనవరి 9న పున: ప్రారంభం కావాల్సి ఉన్నా..…