Kerala orders probe into row over youth fest theme song: కేరళలో యూత్ ఫెస్టివ్ సాంగ్, డ్యాన్స్ స్కిట్ వివాదాస్పదం అయింది. అక్కడి ప్రతిపక్ష పార్టీలు దీనిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అధికార లెఫ్ట్ కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓ వర్గాన్ని కించపరిచేలా ఈ పాట, డ్యాన్స్ స్కిట్ ఉందని ఆరోపిస్తున్నారు. దీంతో సీఎం పినరయి విజయన్ సర్కార్ దీనిపై విచారణకు ఆదేశించింది. ఇటీవల కోజికోడ్ లో జరిగిన యూత్ ఫెస్టివల్ స్వాగత గీతం, డ్యాన్స్ స్కిట్ లో భాగంగా దేశభక్తి, లౌకికవాదం, ఐక్యత,…
UP Minister criticizes Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ని 21 శతాబ్ధపు కౌరవులతో పోలుస్తూ విమర్శించారు. అయితే ఈ విమర్శలపై బీజేపీ కూడా ఘాటుగానే స్పందిస్తోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. పాండువులు తమ సోదరిని ముద్దు పెట్టుకుంటారా.? అని ప్రశ్నించారు. ఇటీవల ఓ బహిరంగ సభలో రాహుల్ గాంధీ తన…
Minor Moves Delhi High Court For Termination Of 16-Week Pregnancy: తన గర్భాన్ని రద్దు చేయాలని కోరుతూ 14 ఏళ్ల మైనర్ తన తల్లి సహాయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మైనర్ అయిన బాలిక, మరో మైనర్ బాలుడు లైంగిక చర్య ద్వారా గర్భాన్ని దాల్చింది. దీంతో వైద్యపరంగా తన గర్భాన్ని రద్దు చేయాలని చెబుతూ కోర్టును ఆశ్రయించింది. బాలిక, బాలుడు ఏకాభిప్రాయం ద్వారా లైంగిక చర్యలో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. ఈ వ్యాజ్యం బుధవారం జస్టిస్ ప్రతిభా ఎం సింగ్…
Governor vs CM in Tamil Nadu: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్ ప్రభుత్వాల మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. ఇప్పటికే అసెంబ్లీలో గవర్నర్ రవి ప్రసంగంపై డీఎంకే పార్టీ మండిపడుతోంది. గవర్నర్ తీరుపై సీఎం స్టాలిన్ అసెంబ్లీలోనే తీర్మానం పెట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని రికార్డుల్లో చేర్చవద్దని అసెంబ్లీ తీర్మానించింది. ఈ చర్యతో అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేశారు. దీని తర్వాత ‘గెట్ అవుట్ రవి’ యాష్ ట్యాగుని డీఎంకే పార్టీ ట్విట్టర్ లో ట్రెండింగ్ అయ్యేలా చేసింది.
Metro Pillar Collapse: బెంగళూర్ లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రోపిల్లర్ కూలింది. ఈ సమయంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న కుటుంబంపై పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించగా, ఒకరు గాయపడ్డారు. తీవ్రగాయాల పాలైన తల్లి, రెండున్నరేళ్ల కుమారుడు మరణించారు.
Kerala High Court Verdict on Sabarimala Temple: అయ్యప్ప స్వామి దర్శనం, మకరజ్యోతిని చూసేందుకు భక్తులు శబరిమలకు పయణం అవుతున్నారు. ఇదిలా ఉంటే కేరళ హైకోర్టు శబరిమలపై కీలక తీర్పును వెలువరించింది. శబరిమల గర్భగుడిలోకి రాజకీయ నాయకులు, ప్రముఖుల పోస్టర్లను తీసుకెళ్లే యాత్రికులను అనుమతించవద్దని శబరిమల ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డును హైకోర్టు ఆదేశించింది. దేవస్థానం సన్నిధానంలోకి పోస్టర్లు మోసుకెళ్లడాన్ని నిషేధించింది.
Iran sentences three more protesters to death: ఇరాన్ ప్రభుత్వం వరసగా మరణశిక్షలు విధించుకుంటూ పోతోంది. గత కొన్ని నెలలుగా మహ్సాఅమిని మరణంపై ఇరాన్ అట్టుడుకుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. పలు ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు ఆందోళనకారులు. ఈ ఘర్షణల్లో ప్రజలతో పాటు భద్రతా సిబ్బంది కూడా మరణించారు. ఇదిలా ఉంటే నిరసనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులను దయలేకుండా పలు నేరాల్లో నిందితులుగా ఆరోపిస్తూ ఖమేనీ ప్రభుత్వం మరణశిక్షలు విధిస్తోంది. ఇప్పటికే పది మంది వరకు…
Snake In Mid-Day Meal: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనంలో పాము వచ్చింది. దీన్ని తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిర్వాహకులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహిరించడం వల్ల పిల్లల ప్రాణాలు ప్రమాదంలో జరిగాయి. గతంలో పలు రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజనం కలుషితం అయింది. బల్లులు ఇతర ప్రాణులు మధ్యాహ్నం భోజనంలో పడటంతో పలువురు పిల్లలు అస్వస్థతకు గురైన ఘటనలు విన్నాం. ప్రస్తుతం ఇలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
Pakistan set to dispatch 159 containers of ammunition to Ukraine: రష్యా-ఉక్రెయిన్ నేపథ్యంలో పాకిస్తాన్ దేశం ఉక్రెయిన్ కు సహకరిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఉక్రెయిన్ కు సైనిక సాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాాజాగా మరోసారి భారీగా పేలుడు పదార్థాలను పంపాలని యోచిస్తోంది. ప్రొజెక్టైల్స్, ప్రైమర్ లతో పాటు 159 కంటైనర్ల పేలుడు సామాగ్రిని పంపనుంది. పాకిస్తాన్ షిప్పింగ్, బ్రోకరేజ్ సంస్థ ప్రాజెక్ట్ షిప్పింగ్ పాకిస్తాన్ కోసం 159 కంటైనర్ల మందుగుండు సామాగ్రిని కరాచీ పోర్ట్ నుంచి పోలాండ్…
Joshimath Sinking: ఉత్తరాఖండ్ జోషిమఠ్ పట్టణం కుంగిపోతోంది. ఇప్పటికే 600కు పైగా ఇళ్లకు బీటలు వారాయి. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే జోషిమఠ్ పట్టణం కుంగిపోవడంపై కేంద్ర ప్రభుత్వం కూడా సమావేశం అయింది. ప్రధాని నరేంద్రమోదీ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రమాదం అంచున ఉన్న ఇళ్లను కూల్చివేస్తోంది ప్రభుత్వం. మంగళవారం నుంచి కూల్చివేతను ప్రారంభించింది. జోషిమఠ్ పట్టణాన్ని మూడు భాగాలుగా విభజించింది. డేంజర్, బఫర్, పూర్తిగా సురక్షితమైన ప్రాంతాలుగా విభజించి కూల్చివేతలు ప్రారంభించింది.