North Korea Puts Capital In 5-Day Lockdown: ఉత్తర కోరియాలో మరోసారి కరోనా విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కిమ్ సర్కార్ మాత్రం దీన్ని కరోనా అని పిలవకుండా ‘‘శ్వాసకోశ అనారోగ్యం’’ అనే పేర్కొంటోంది. ఇదిలా ఉంటే తాజాగా నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంలో 5 రోజుల పాటు లాక్ డౌన్ విధించినట్లు తెలుస్తోంది. అయితే ఇది రాజధానికే పరిమితం అయిందా..? లేక పోతే దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా విధించిందా..? అనేది స్పష్టంగా తెలియడం లేదు.
Read Also: Uttar Pradesh: ఇద్దరు అమ్మాయిల ప్రేమ.. లింగమార్పిడి.. చివరకు ట్విస్ట్ ఏంటంటే..?
ప్యాంగ్యాంగ్ లో శ్వాసకోశ అనారోగ్యం కేసులు పెరుగుతన్న నేపథ్యంలో 5 రోజులు లాక్ డౌన్ విధించినట్లు సియోల్ కు చెందిన ఎస్కే న్యూస్ బుధవారం వెల్లడించింది. నగరంలోని ప్రజలు ఆదివారం వరకు తమ ఇళ్లలోనే ఉండాలని, ప్రతీ రోజు అనేక సార్లు ప్రజలు తమ ఉష్ణోగ్రతను పరీక్షించుకోవాలని సూచించింది. మంగళవారం ప్యాంగ్యాంగ్ లోని ప్రజలు కఠినమైన నిబంధనలను గుర్తుంచుకుని నిత్యావసరాలను ముందుగానే నిల్వ చేసుకుంటున్నారు.
ఉత్తర కొరియాలో గతేడాది మొదటిసారిగా కోవిడ్-19 వ్యాప్తి జరిగింది. అయితే ఆగస్టు నాటికి వైరస్ పై విజయం సాధించామని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఎంత మందికి కోవిడ్ వచ్చిందనే వివరాలను ప్రకటించలేదు. దీనికి బదులుగా రోజూవారీగా జ్వరంతో బాధపడుతున్న రోగుల సంఖ్యను వెల్లడించింది. దేశంలో 25 మిలియన్ల జనాభాలో 4.77 మిలియన్లు శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. జూలై 29 నుంచి ఈ కేసుల వివరాలను ప్రకటించలేదు. దక్షిణ కొరియా సరిహద్దుకు సమీపంలో ఉన్న కెసోంగ్ నగరం ప్రజాప్రచారాన్ని ప్రారంభించడంతో ప్రజలంతా స్వచ్ఛందంగా అంటువ్యాధి నిరోధక నిబంధనలు పాటిస్తున్నారు.