DK Shivakumar: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఆ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుండగా..మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ చెబుతోంది.
Read Also: Air India: ఆల్కాహాల్ పాలసీని సవరించిన ఎయిర్ ఇండియా..
ఇదిలా ఉంటే కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి దెబ్బతిందని ఆన్నారు. బీజేపీ పార్టీ రాష్ట్ర సచివాలయాన్ని మలినం చేసిందని.. తాము అధికారంలోకి రాగానే విధాన సౌధను ఆవుమూత్రంతో శుభ్రం చేస్తానని వెల్లడించారు. మరో 40-45 రోజుల్లో కాంగ్రెస్ అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ సిద్ధంగా ఉండాలని.. మీ టెంట్లన్ని సర్దుకోండి అంటూ శివకుమార్ అన్నారు.
డెటాల్ తో విధాన సౌధను శుభ్రం చేస్తానని.. గోమూత్రంతో శుభ్రం చేసి వినాయకుడిని ఉంచి పూజిస్తామని అన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొడతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 2023లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.