Maruti Suzuki Grand Vitara recalled: మారుతి సుజుకీ గతేడాది గ్రాండ్ విటారాను ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ చేసింది. హైబ్రీడ్ కారుగా గ్రాండ్ విటారాను తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే ఈ కార్లలో కొన్ని లోపాలు ఉండటంతో ఏకంగా 11,177 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. వెనక సీట్ బెల్ట్ మౌంట్ బ్రాకెట్లలో లోపం ఉందని గుర్తించింది. దేశంలో అతిపెద్ద కార్ మేకర్ అయిన మారుతి సుజుకీ గ్రాండ్ విటారా విషయంలో రెండు నెలల్లో మూడోసారి రీకాల్ చేసింది.
ఆగస్టు 8, 2022, నవంబర్ 15, 2022 మధ్య తయారైన 11,117 కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. గ్రాండ్ విటారాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది మారుతీ సుజుకీ. మిడ్ సైజ్ ఎస్ యూ వీగా గ్రాండ్ విటారానాను జపనీస్ ఆటో మేకర్ టయోటా మోటార్ కార్పరేషన్, సుజుకీ మోటార్ కార్పొరేషన్ కలిసి అభివృద్ధి చేశాయి. ఇదే సమయంలో ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంతో టయోటా కిర్లోస్కర్ మోటార్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ను తయారు చేసింది.
Read Also: Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ సెకండ్ పార్ట్ ఉందా? అందుకే అలా ముగిసిందా?
వెనక సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్ లో లోపం ఉందని కంపెనీ అనుమానిస్తోంది. ఇది దీర్ఘకాలంలో ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీంతో వాహన యజమానులు మారుతి సుజుకీ వర్క్ షాప్ లలో ప్రభావితమైన భాగాలను తీసేసి కొత్తవి బిగించనున్నారు. జనవరి 18న ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్ లోపం కారణంగా మారుతి గ్రాండ్ విటారా, బ్రెజ్జా, బాలెనో, ఆల్టో కే 10, ఎస్-ప్రెస్సో మరియు ఈకో యొక్క 17,362 యూనిట్లను రీకాల్ చేసింది. డిసెంబరు 6, 2022న, ముందు వరుస సీట్‌బెల్ట్‌లకు సంబంధించిన లోపం కారణంగా కంపెనీ గ్రాండ్ విటారా, బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6, సియాజ్ యొక్క 9,125 యూనిట్లను రీకాల్ చేసింది.
గ్రాండ్ విటారా ధర రూ. 10.45 లక్షల నుంచి రూ. 19.49 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. మార్కెట్ లోని హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు ఎమ్‌జి ఆస్టర్ కార్లకు గట్టిపోటీని ఇస్తోంది. మైల్డ్ హైబ్రీడ్, స్ట్రాంగ్ హైబ్రీడ్ వేరియంట్లతో గ్రాండ్ విటారా మార్కెట్ లోకి లాంచ్ అయింది.